ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే.ఈ పెళ్లికి బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల నుంచి సినీ ప్రముఖులు హాజరయ్యారు.
టాలీవుడ్ నుంచి చాలామంది సెలబ్రిటీలు పెళ్లికి హాజరు కాకపోయినా రిసెప్షన్ కు మాత్రం టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతారని సమాచారం.అయితే సాధారణంగా పెళ్లి అంటే పట్టుచీర ధరిస్తారనే సంగతి తెలిసిందే.
అయితే విఘ్నేష్ శివన్ కుటుంబం పాటించే ఒక సంప్రదాయం వల్ల నయనతార పెళ్లిలో పట్టుచీర ధరించలేదని బోగట్టా.కోలీవుడ్ మీడియా వర్గాలలో ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
డిజైనర్ వేర్ శారీలో నయనతార కనిపించగా విఘ్నేష్ కుటుంబ సభ్యుల సాంప్రదాయం ప్రకారం రెడ్ కలర్ చీరలో కనిపించాలని అందుకోసమే నయనతార పెళ్లిలో డిజైనర్ వేర్ శారీలో దర్శనమిచ్చారని సమాచారం.
అయితే పెళ్లికూతురి గెటప్ లో నయనతార కుందనపు బొమ్మలా ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నయనతార సినిమాలకు గుడ్ బై చెబుతారని ఇండస్ట్రీలో వినిపిస్తున్నా ఆ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని సమాచారం అందుతోంది.నయనతార తర్వాత ప్రాజెక్ట్ లలో ఒకటైన గాడ్ ఫాదర్ ఈ ఏడాదే రిలీజ్ కానుంది.తెలుగుతో పోల్చి చూస్తే తమిళంలోనే నయనతార ఎక్కువగా నటిస్తున్నారు.

నయనతార తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నయనతార ఒక్కో సినిమాకు 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారనే సంగతి తెలిసిందే.నయనతారకు హిందీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నా సౌత్ సినిమాలతోనే విజయాలను అందుకోవలని ఆమె కోరుకుంటున్నారు.
పెళ్లి తర్వాత నయన్ విఘ్నేష్ సంతోషంగా జీవనం సాగించాలని నయన్ విఘ్నేష్ అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.







