నాగ్ జాతీయ అవార్డ్ మిస్ కావడానికి ఆ స్టార్ హీరో కారణమా.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున తన నటనతో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే.నాగార్జున నటించిన బంగార్రాజు ఈ ఏడాది రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఒకటి కావడం గమనార్హం.

 Reasons Behind Nagarjuna Missing National Award Details, Nagarjuna, National Awa-TeluguStop.com

ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్న నాగ్ ఈ సినిమా ఫలితం విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే సీనియర్ ఎన్టీఆర్ వల్ల నాగార్జునకు జాతీయ అవార్డ్ మిస్ అయిందని సమాచారం.నాగార్జున హీరోగా నటించిన సంకీర్తన సినిమాకు జాతీయ అవార్డ్ రావాల్సి ఉందని అయితే సీనియర్ ఎన్టీఆర్ పై ఉన్న కోపం వల్ల కేంద్రం కొన్నేళ్ల పాటు జాతీయ అవార్డ్ ను ఆపేసిందని ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగుకు ఇవ్వాల్సిన అవార్డును సైతం ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అనే కారణంతో ఇవ్వలేదని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు.

సినిమాసినిమాకు నాగార్జునకు క్రేజ్ పెరుగుతుండగా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే కథలలో నాగార్జున నటిస్తున్నారు కుర్ర హీరోలకు నాగార్జున గట్టి పోటీ ఇస్తున్నారు.

Telugu Geeta Krishna, Nagarjuna, Nandamuritaraka, National Award, Sankeerthana,

ఆరు పదుల వయస్సులో కూడా నాగార్జున యంగ్ గానే కనిపిస్తున్నారు.ఈతరం హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు నాగార్జునతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని ఆశపడుతున్నారు.నాగార్జున రెమ్యునరేషన్ కూడా 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది.

Telugu Geeta Krishna, Nagarjuna, Nandamuritaraka, National Award, Sankeerthana,

అయితే నాగార్జున తన నటనతో పలు అవార్డులను గెలుచుకున్నారు.అటు క్లాస్ ప్రేక్షకులతో పాటు ఇటు మాస్ ప్రేక్షకుల్లో సైతం నాగార్జునకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.నాగార్జున కొన్ని విషయాలలో గ్రేట్ అని ఎంతోమంది కొత్త డైరెక్టర్లకు అవకాశాలను ఇప్పించారని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube