బాలయ్యకు భయపడిన కీర్తి సురేష్.. ఆ సినిమాను వాయిదా వేస్తూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ బాలయ్యకు భయపడ్డారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఈ నెల 10వ తేదీన రిలీజ్ కావాల్సిన కీర్తి సురేష్ సినిమా గుడ్ లక్ సఖి వాయిదా పడింది.

మహానటి తర్వాత కీర్తి సురేష్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయి.గుడ్ లక్ సఖితో కీర్తి సురేష్ సక్సెస్ సాధిస్తారని కీర్తి సురేష్ ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ సినిమా వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

నవంబర్ 26వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా డేట్ ఆ తర్వాత డిసెంబర్ 10వ తేదీకి మారింది.తాజాగా ఈ సినిమా మేకర్స్ డిసెంబర్ 31వ తేదీకి ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద అఖండ ప్రభంజనం కొనసాగుతోంది.మరోవైపు నాగశౌర్య నటించిన లక్ష్య  సినిమా సైతం డిసెంబర్ 10వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో  గుడ్ లక్ సఖి మూవీ పోటీ నుంచి తప్పుకుంది.

Advertisement

కొన్ని రోజుల క్రితం గుడ్ లక్ సఖి ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు రాగా ఆ వార్తలు నిజం కాలేదు.

అఖండ సినిమాకు పోటీగా రిలీజైన మరక్కార్, స్కై లాబ్ సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోలేదు.పుష్ప రిలీజయ్యే వరకు అఖండ దూకుడు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.లాంగ్ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుని రికార్డు స్థాయిలో అఖండ కలెక్షన్లను సాధించగా ఈరోజు అఖండ సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫలితంపై ఒక అవగాహనకు రావచ్చు.

ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ గుడ్ లక్ సఖి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.డిసెంబర్ 31వ తేదీన  గుడ్ లక్ సఖి విడుదలైతే వారం రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్లను సాధించాల్సి ఉంటుంది.2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుండగా ఆర్ఆర్ఆర్ విడుదలైతే కీర్తి సురేష్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఆ సినిమా థియేటర్లను ఆర్ఆర్ఆర్ కు కేటాయించాల్సి వస్తుంది.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు