నమస్కారం వెనుక రహస్యం ఏంటో తెలుసా?

మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, ఒకరికొకరు నమస్కరించుకోవడం మన ఆచారం.

అయితే ఇలా పలకరించుకునే విధానం ఒక్కో చోట ఒక్కో పద్ధతిలో ఉంటుంది.

అవి వారి సంస్కృతి సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి.ఈ పలకరింపులో ఉన్న పరమార్థం ఒక్కటే.

What Is Reasons Behind Indian Salutation Namaskar Reasons, Indian Salutation Na

పెద్దవారిని చూడగానే చిన్నవారు నమస్కరించడం మన భారతీయులు చేసేపని.నమస్కారంలో నమ అంటే వంగి ఉండటం.

పెద్ద వారిని చూడగానే ఎంతో వినయ విధేయతలతో మన అహంకారం ప్రదర్శించకుండా, ఉండటం అని అర్థం.పూర్వకాలంలో మన పూర్వీకులు పెద్ద వారిని చూడగానే చిన్న గారు ఎంతో వినయంగా నమస్కరించే వారు.

Advertisement

కానీ ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక వ్యక్తిని పలకరించాలి అంటే హాయ్ అనే ఇంగ్లీష్ పదం వాడేస్తున్నారు.ఇలా పలకరించడం ఎట్టి పరిస్థితిలోనూ మంచిది కాదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

రెండు చేతులు జోడించి నమస్కరించడం వల్ల మన శరీరంలో అద్భుతమైన మార్పులు సంభవించి ఉంటాయని, వేద పండితులు చెబుతున్నారు.నమస్కారాలు రెండు రకాలు ఒకటి మనం రెండు చేతులను జోడించి, ఎదుటి వ్యక్తిని చూస్తూ నమస్కరించడం.

రెండవది రెండు చేతులు జోడించి తల వంచి గౌరవప్రదంగా నమస్కరించడం.రెండు చేతులు జోడించి నమస్కరించడం వల్ల మన చేతి వేళ్ళు ఒకదానికొకటి తాకి, మనలో శక్తిని ప్రసరింపచేస్తోంది.

ఈ శక్తి నరాల ద్వారా మన కళ్ళు, మెదడుకు, చెవులకు ప్రసరింపజేయడం వల్ల ఎదుటి వ్యక్తిని చూస్తూ నమస్కరించడం వల్ల వారు మనకు అలాగే జీవితకాలం గుర్తుండిపోతారు.అలాగే రెండు చేతులు జోడించి నమస్కరించడం గౌరవ సూచకంగా భావిస్తారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

మనలో అహంకారాన్ని విడిచిపెట్టి, అవతలి వ్యక్తి పై గౌరవాన్ని పెంపొందిస్తుంది.రెండు చేతులు జోడించి నమస్కరించడం వల్ల ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది.

Advertisement

ఒకరికొకరు కరచాలనం చేసుకోవడం ద్వారా ఒకరినుంచి ఒకరికి క్రిములు వ్యాపించి, అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.చేతులు జోడించి నమస్కరించడం వల్ల ఎంతో మంచి ఆరోగ్యం కలుగుతుంది.

దేవుడికి నమస్కరించేటప్పుడు రెండు చేతులను జోడించి నమస్కరించాలి.అలాగే పెద్దవారికి నమస్కరించే టప్పుడు నుదిటిపై అంజలి ఘటించాలి.

తల్లిదండ్రులకు గురువులకు నమస్కరించే టప్పుడు తల వంచి, రెండు చేతులు జోడించి గౌరవప్రదంగా ఒంగి నమస్కరించాలి.చూశారు కదా నమస్కరించడంలో దాగి ఉన్న పరమార్థం.

తాజా వార్తలు