టాలీవుడ్, కోలీవుడ్( Tollywood, Kollywood ) ఇండస్ట్రీలలో ఎంతో మంది సెలబ్రిటీ జోడీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది.అలా ప్రేమించుకున్న జోడీలలో ప్రభు, ఖుష్బూ జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.
ప్రముఖ నటి కాకినాడ శ్యామల( Kakinada shyamala ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ జోడీ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఖుష్బూ ఒక వెలుగు వెలిగారు.
బాలనటిగా ఖుష్బూ( Khushboo ) కెరీర్ ను మొదలుపెట్టగా స్టార్ హీరోలలో దాదాపుగా అందరు హీరోలతో కలిసి నటించారు.తన సినీ కెరీర్ లో ఖుష్బూ 200కు పైగా సినిమాలలో నటించడం గమనార్హం.
చిన్నతంబి అనే సినిమాలో ప్రభు, ఖుష్బూ కలిసి నటించగా ఈ సినిమా తమిళంలో సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా షూట్ సమయంలో ప్రభు( Prabhu ), ఖుష్బూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది.
ఆ తర్వాత 1993 సెప్టెంబర్ లో వీళ్లిద్దరికీ పెళ్లి కూడా జరిగిందట.అయితే ప్రభు కుటుంబం ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో ప్రభు, ఖుష్బూ విడాకులు తీసుకున్నారు.ప్రభుకు దూరమైన తర్వాత ఖుష్బూ మానసికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ మానసిక వేదన తర్వాత ఖుష్బూ మానసిక వేదన నుంచి కోలుకున్నారు.ఆ తర్వాత ఖుష్బూ దర్శకుడు సుందర్( Director Sundar ) ను పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారనే సంగతి తెలిసిందే.
కాకినాడ శ్యామల మాట్లాడుతూ ఖుష్బూ చాలా మంచి అమ్మాయి అని ప్రభు, ఖుష్బూ ప్రేమించుకున్నారని ఒకరంటే ఒకరికి ప్రాణమని ప్రభు భార్య అంగీకరించకపోవడం వల్లే ప్రభు, ఖుష్బూపెళ్లి జరగలేదని కాకినాడ శ్యామల చెప్పుకొచ్చారు.అమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఖుష్బూకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.