సుడిగాలి సుధీర్ రష్మీ జోడీ తర్వాత ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న జోడీ ఇమ్మాన్యుయేల్ వర్ష జోడీ కాగా ఈ జోడీకి ప్రేక్షకుల్లో బాగానే గుర్తింపు ఉంది.కొంతకాలం ఈ జోడీ కలిసి స్కిట్లు చేయగా ప్రస్తుతం ఈ జోడీ కలిసి స్కిట్లు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు.
అయితే సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్ల వల్లే ఈ జోడీ కలిసి స్కిట్లు చేయడం లేదని ప్రచారం జరుగుతోంది.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో ఇమ్మాన్యుయేల్ నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని పాట పాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
రష్మీ ఇమ్మాన్యుయేల్ వర్షలను పక్కపక్కన నిలబెట్టి అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదా మీ మధ్య అని అడగగా అది ఎప్పటికీ మారదేమో అనిపించిందని అందుకే ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఏమైంది వర్ష అని ఇంద్రజ అడగగా వర్ష తల దించుకున్నారు.
ఈ ఏడాది నవంబర్ నెల 6వ తేదీన ఈ ఎపిసోడ్ బుల్లితెరపై ప్రసారం కానుంది.ఈ ఎపిసోడ్ లో వర్ష విడిపోవడానికి ఎలాంటి కారణాలను చెబుతుందో చూడాలి.

శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ మరింత స్పెషల్ గా ఉండేలా ఈ షో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాల్సి ఉంది.అమ్మ రాజశేఖర్ తన భార్యను చూపిస్తూ ఆమెను చూసిన తర్వాతే ప్రాణం వచ్చిందని అన్నారు.
హైపర్ ఆది వల్లభ సినిమాలోని టైటిల్ సాంగ్ కు అదిరిపోయే రేంజ్ లో డ్యాన్స్ స్టెప్పులు వేసి మెప్పించారు.హైపర్ ఆది వరుస సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.
ఇమ్మాన్యుయేల్ వర్ష జోడీ కలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







