అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోయిన్ కాకపోవడానికి ఆ తప్పే కారణమా?

అందం, అభినయం, ప్రతిభ ఉన్న హీరోయిన్లు సినిమా రంగంలో మెప్పించడం కష్టం లేదు.ఈ తరహా హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో సులువుగానే స్టార్ స్టేటస్ లభిస్తుంది.

 Reasons Behind Anupama Parameshwaran Not Become Star Heroine Details, Anupama Pa-TeluguStop.com

అయితే ఈ హీరోయిన్లు కెరీర్ విషయంలో సక్సెస్ కావాలంటే స్టార్ స్టేటస్ కూడా సొంతం కావాలి.అయితే అనుపమ పరమేశ్వరన్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోకపోవడానికి కెరీర్ పరంగా చేసిన తప్పులే కారణమని సమాచారం అందుతోంది.

కెరీర్ తొలినాళ్లలో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించడం, పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనుపమ కెరీర్ కు శాపంగా మారిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ రీజన్ వల్లే స్టార్ హీరోలు సైతం అనుపమకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

కెరీర్ పరంగా ఈ పొరపాట్లు చేయకుండా ఉండి ఉంటే అనుపమ రష్మిక, పూజా హెగ్డే రేంజ్ లో ఉండేవారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కెరీర్ తొలినాళ్లలో స్కిన్ షోకు నో చెప్పడం కూడా ఈ హీరోయిన్ కు మైనస్ అయిందని తెలుస్తోంది.

Telugu Karthikeya, Pooja Hegde, Rashmika-Movie

ఇప్పుడు అనుపమ స్కిన్ షోకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమెను పట్టించుకునే వాళ్లు లేరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎంత కష్టపడినా అనుపమకు స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు రాలేదు.కార్తికేయ2 సక్సెస్ సాధించినా అనుపమ పాత్రకు మంచి మార్కులు పడలేదు.

Telugu Karthikeya, Pooja Hegde, Rashmika-Movie

ఒకే తరహా పాత్రలను ఎంచుకోవడం వల్ల కూడా అనుపమ కెరీర్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయకపోయినా ఈ హీరోయిన్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు.హీరోయిన్ అనుపమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

హీరోయిన్ అనుపమకు 2023 సంవత్సరం అయినా కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube