అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోయిన్ కాకపోవడానికి ఆ తప్పే కారణమా?

అందం, అభినయం, ప్రతిభ ఉన్న హీరోయిన్లు సినిమా రంగంలో మెప్పించడం కష్టం లేదు.

ఈ తరహా హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో సులువుగానే స్టార్ స్టేటస్ లభిస్తుంది.అయితే ఈ హీరోయిన్లు కెరీర్ విషయంలో సక్సెస్ కావాలంటే స్టార్ స్టేటస్ కూడా సొంతం కావాలి.

అయితే అనుపమ పరమేశ్వరన్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోకపోవడానికి కెరీర్ పరంగా చేసిన తప్పులే కారణమని సమాచారం అందుతోంది.

కెరీర్ తొలినాళ్లలో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించడం, పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనుపమ కెరీర్ కు శాపంగా మారిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ రీజన్ వల్లే స్టార్ హీరోలు సైతం అనుపమకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

కెరీర్ పరంగా ఈ పొరపాట్లు చేయకుండా ఉండి ఉంటే అనుపమ రష్మిక, పూజా హెగ్డే రేంజ్ లో ఉండేవారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కెరీర్ తొలినాళ్లలో స్కిన్ షోకు నో చెప్పడం కూడా ఈ హీరోయిన్ కు మైనస్ అయిందని తెలుస్తోంది.

"""/"/ ఇప్పుడు అనుపమ స్కిన్ షోకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమెను పట్టించుకునే వాళ్లు లేరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంత కష్టపడినా అనుపమకు స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు రాలేదు.కార్తికేయ2 సక్సెస్ సాధించినా అనుపమ పాత్రకు మంచి మార్కులు పడలేదు.

"""/"/ ఒకే తరహా పాత్రలను ఎంచుకోవడం వల్ల కూడా అనుపమ కెరీర్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయకపోయినా ఈ హీరోయిన్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు.

హీరోయిన్ అనుపమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.హీరోయిన్ అనుపమకు 2023 సంవత్సరం అయినా కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.

‘బైరవం’ సినిమాలో నారా రోహిత్ మంచు మనోజ్ క్యారెక్టర్లు ఏంటి..?