గుట్టు విప్పిన షర్మిల... నేను ఎవరు వదిలిన బాణాన్నంటే?

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

అయితే ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రణరంగం కొనసాగుతున్న పరిస్థితులలో షర్మిల పార్టీ ప్రకటన పేరుతో ఒక్కసారిగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

అయితే పార్టీ పేరు ప్రకటన, జెండా పేరు ప్రకటన లేకుండానే ఇప్పటికే చేరికలు ప్రారంభమయ్యాయి.షర్మిల పార్టీ ప్రకటన చేయగానే బీజేపీ బీ టీమ్ అని కొందరు వ్యాఖ్యానించగా, జగనన్న వదిలిన బాణమని కొందరు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహంలో భాగమని కొందరు వ్యాఖ్యనించారు.

YS Sharmila Reveals Reason For Starting New Political Party In Telangana,YS Sha

అయితే ఈ తరహా ప్రచారంపై వై.ఎస్.షర్మిల స్పందించింది.నేను బీజేపీకి బీ టీమ్ నని, జగనన్న వదిలిన బాణమని, కేసీఆర్ వ్యూహం అని జరుగుతున్న వార్తలను ఖండిస్తున్నానని షర్మిల అన్నారు.

నేను ఒక స్పష్టతతో సిద్ధాంతపూర్వక రాజకీయాలే తమ నినాదమని షర్మిల తెలిపారు.అయితే ఇప్పటికే చేరికలు ప్రారంభం కావడంతో షర్మిల పార్టీపై రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న పరిస్థితి ఉంది.

Advertisement

మరి ఒక స్పష్టమైన లక్ష్యంతో రాజకీయాలలోకి వస్తున్నానంటున్న షర్మిల రాను రాను ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.అంతేకాక ఇప్పటికే ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల పైన ఫోకస్ పెట్టాలని నిర్ణయించిన షర్మిల ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!
Advertisement

తాజా వార్తలు