మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంతో మంది క్రికెటర్లకు రోల్ మోడల్… ఒక్కసారైనా ధోనీని కలవాలని, ధోనీతో ఒక్క ఫోటో దిగితే చాలని అనుకునే వారు కోకొల్లలు.కాని ఆ అవకాశం అందరికీ రాదు.
క్రికెట్ లో శిక్షణ పొంది, కొంచెం టాలెంట్ ఉన్న క్రికెటర్ గా గుర్తింపు పొందితే ఏమైనా అవకాశం ఉంటుంది.అయితే అలా ధోనీని అభిమానించి స్టార్ క్రికెటర్ లుగా ఎదిగిన వారూ లేకపోలేదు.
అందులో రిషబ్ పంత్ ఇలా వర్ధమాన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు.అయితే ఇక ధోనీకి బౌలింగ్ వేసే అవకాశం వస్తే ఇక ఆ క్రికెటర్ ఆ రోజును జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు.
అలా ధోనీకి బౌలింగ్ వేయడమే కాదు, ధోనీని వికెట్ పడగొట్టాడు తెలుగు తేజం 22 ఏళ్ల యువ బౌలర్ హరి శంకర్ రెడ్డి.ఇక అతనిని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు నువ్వు అనుకున్నది సాధించావ్, నీ అభిమాన క్రికెటర్ నే బౌల్డ్ చేసావ్ అని నెటిజన్లు బౌలర్ హరి శంకర్ రెడ్డిని అభినందిస్తున్నారు.
ఇక తెలుగు వారైతే నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది, తెలుగోడి సత్తా ఎలుగెత్తి చాటావ్ అని నెటిజన్లు హరిశంకర్ ను అభినందిస్తున్నారు.