యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ( Jr NTR ) ఈ మధ్య కాలంలో కొంతమంది కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు.తారక్ వైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోయినా చిన్నచిన్న విషయాలను అనవసరంగా పెద్దవి చేస్తూ తారక్ పై నెగిటివిటీని పెంచుతున్నారు.
మే నెల 28వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు( Sr NTR Birth Anniversary ) సందర్భంగా తారక్ ఎన్టీఆర్ ఘాట్ కు( NTR Ghat ) వెళ్లగా అక్కడకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.కొంతమంది అభిమానులు తోసుకుంటూ తారక్ కు బొకే ఇవ్వడానికి ప్రయత్నించగా తారక్ ఆ బొకేను తీసుకోలేదు.
ఒకే సమయంలో ఇద్దరు అభిమానులు బొకే ఇవ్వడానికి వచ్చి తోసుకుంటూ వెళ్లగా తారక్ ఎవరి బొకే తీసుకోలేదు.అయితే కొంతమంది మాత్రం తారక్ ను కావాలని టార్గెట్ చేస్తూ అభిమానుల విషయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కఠినంగా వ్యవహరించాడని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తున్నారు.
అయితే వాస్తవాలను కప్పిపుచ్చి ఫోటోలు, వీడియోలను వైరల్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

లిమిట్స్ క్రాస్ చేస్తున్న అభిమానులకు సైతం కొంచెమైనా బుద్ధుండాలని ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టే విధంగా వాళ్లు వ్యవహరించడం ఏ మాత్రం కరెక్ట్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.తోసుకుంటూ మీద పడుతూ బొకే ఇవ్వాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తే మాత్రం ఊరుకోమని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఎన్టీఆర్ ఏ తప్పు చేయకపోయినా కావాలని ట్రోల్స్ చేస్తున్నారని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంది.అభిమానుల సహనాన్ని పరీక్షించే విధంగా ఫ్యాన్స్ వ్యవహరించడం సరికాదనే చెప్పాలి.
