గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం.విజయవాడకు సమీపంలో ఉన్న నియోజకవర్గం మంగళగిరి.
ఇక్కడ నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు సీనియర్ నాయకుడు.విమర్శల కింగ్.ఆళ్ల రామకృష్ణారెడ్డి.2014లో ఆయన ఇక్కడ నుంచి విజయం సాధించిన తర్వాత.చంద్రబాబు సర్కారుపై విమర్శలు చేయడం, న్యాయపోరాటానికి దిగడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గుర్తింపు పొందారు.ఇక,గత ఎన్నికల్లో చంద్రబాబు తనయుడు లోకేష్‌పై పోటీ చేసి.
తీవ్ర ఉత్కంఠ పోరులోనూ విజయం దక్కించుకున్నారు.జగన్ సైతం లోకేష్‌ను ఓడిస్తే ఆళ్లకు మంత్రి పదవి ఇచ్చి కేబినెట్‌లో తన పక్కన కూర్చోపెట్టుకుంటానని కూడా చెప్పారు.
దీంతో ఆళ్లపై వైసీపీలో అనేక అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ లోకేష్ ఇక్క డనుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ఆయనను మరోసారి ఓడించాలన్నా.
ఆళ్ల దూకుడుగా వ్యవహరిం చాల్సిన అవసరం ఉంది.కానీ, ఇప్పటి వరకు ఏడాదిన్నర పైగా సమయం గడిచిపోయినా.ఆళ్ల ఈ అంచనాలు అందుకోలేక పోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అభివృద్ది అన్నది ఎక్కడా కనిపించడం లేదు.
అదే సమయంలో పార్టీ తరఫున ప్రజలకు చేరువ అవుతున్నది కూడా లేదు.ముఖ్యంగా రాజధాని మార్పు ప్రకటన తర్వాత.
ఆయన నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో పర్యటన కూడా చేయడం లేదు.

పార్టీలో దూకుడుగా ఉండలేక పోతున్నారు.కరోనా సమయంలో ఏకంగా వ్యవసాయం చేసుకున్నారు.ఇక, జగన్ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు.
ఎన్నికలకు ముందు ఆళ్లకు మంత్రి పదవి ఇస్తామని అన్నారు.కానీ, ఇప్పటి వరకు ఇవ్వలేదు.
అయితే.సీఆర్డీఏ చైర్మన్‌ను చేశారు.
కాని, ఇప్పుడు దీనిలో ఎలాంటి పనిలేకుండా పోయింది.మరోవైపు మంత్రి పదవీ దక్కలేదు.
దీంతో ఆళ్ల దూకుడు తగ్గించేశారు.ఇక, పార్టీ తరఫున కూడా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు.
కేడర్ బలహీన పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాజధాని విషయంలో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
వారి వ్యాపారాలు.దెబ్బతినడానికి.
రాజధాని మార్పే కారణమని అనుకుంటున్నారు.ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడుతున్న ఆళ్లపై వ్యతిరేక బావుటా ఎగురవేస్తున్నారు.
రాజధాని మార్పు అంశంపై ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా ఆళ్ల మాటలు పట్టించుకునే పరిస్థితి లేదు.ఇక, టీడీపీ దూకుడుగా ఉన్నా.
ఎమ్మెల్యే ఏమాత్రం వారికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకపోవడం కూడా ఆయనకు మైనస్‌లు పడేలా చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఓ సర్వేలోనూ ఆళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, లోకేష్ పుంజుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో లోకేష్ గ్రాఫ్ పెరుగుతోందని అంచనాలు రావడం గమనార్హం.