మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ప్రజెంట్ లైనప్ లో ఇద్దరు డైరెక్టర్లు ఉన్న విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ ఏ సినిమా చేసిన అంచనాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి.
మరి ప్రజెంట్ చరణ్ ఒక సినిమాను చివరి దశకు చేర్చగా మరో సినిమాను స్టార్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఈయన లైనప్ లో ఉన్న రెండు సినిమాల్లో ఒకటి బుచ్చిబాబు సానా( Buchi Babu Sana ) ప్రాజెక్ట్. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మరింత ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కోసం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు.
ఈ కొత్త ఆఫీస్ ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరుగగా సుకుమార్ ఈ ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసారు.ఈయన చేతుల మీదుగా కొత్త ఆఫీస్ ఓపెన్ చేయగా అతి త్వరలోనే షూట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా మొత్తం ఉత్తరాంధ్ర యాసలో సహజంగా ఉండాలని ఆ యాసపై పట్టు ఉన్న రచయితను ఈ సినిమాకు పెట్టుకుని అన్ని పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్( Shankar ) దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్( Game Changer ) సినిమాను చేస్తుండగా ఇది పూర్తి కాగానే బుచ్చిబాబు మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.







