స్నేహితుడి కోసం భారీ రిస్క్ చేస్తోన్న మాస్ రాజా!

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఈ హీరో ఖిలాడి అనే పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.

 Raviteja Taking Huge Risk For Srinu Vytla, Raviteja, Srinu Vytla, Khiladi, Ramar-TeluguStop.com

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు.కాగా ఈ రెండు సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ వద్ద క్రాక్ లాంటి విజయాన్ని అందుకోవాలని ఆతృతగా ఉన్నాడు మాస్ రాజా.

అయితే తనకు స్నేహితుడైన ఓ డైరెక్టర్ కోసం ఇప్పుడు రవితేజ ఓ భారీ రిస్క్ తీసుకునేందుకు రెడీ అయ్యాడు.గతంలో దర్శకుడు శ్రీను వైట్ల సినిమాలంటే ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యేవో అందరికీ తెలిసిందే.

ఆయన తెరకెక్కించిన కామెడీ జోనర్ చిత్రాలకు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంది.ఇక ఈ డైరెక్టర్‌కు ఆగడు చిత్రం నుండి వరుసగా ఫెయిల్యూర్ ఎదురవుతుండటంతో అందులోనుండి బయటకు రాలేకపోతున్నాడు.

ఈ క్రమంలో శ్రీను వైట్ల డౌన్‌ఫాల్ చూసిన రవితేజ మరోసారి ఆయన ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ అనే సినిమా చేసి ఆదుకుందామని ప్రయత్నించాడు.కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

దీంతో శ్రీను వైట్ల ప్రస్తుతం గట్టిగా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే తన స్నేహితుడి కోసం ఏదైనా చేయాలని మరోసారి రవితేజ నిర్ణయించుకున్నాడట.

దీంతో సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేసి అందులో శ్రీను వైట్లతో ఓ సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.స్నేహితుడికి ఎలాగైనా సక్సెస్ అందించాలని చూస్తున్న మాస్ రాజా మనసుకు ఆయన అభిమానులు హ్యాట్సాఫ్ కొడుతున్నారు.

మరి శ్రీను వైట్ల కోసం రవితేజ చేయబోతున్న ప్రయత్నం ఆయనకు సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube