రావణాసుర సినిమాకి కూడా కాస్త ఎక్కువ కష్టపడాలనుకుంటున్న రవితేజ

మాస్‌ మహారాజా రవితేజ గత చిత్రం ధమాకా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.రవితేజ ఆ సినిమా తో ఏకంగా వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్న విషయం తెల్సిందే.

 Raviteja Ravanasura Movie Promotion Update , Dhamaka, Film News,ravanasura,ravit-TeluguStop.com

రవితేజ కెరీర్‌ లో నిలిచి పోయే విజయాన్ని సొంతం చేసుకున్న ధమాకా సందడి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించిన ధమాకా సినిమా తర్వాత రవితేజ ‘రావణాసుర‘ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యింది.అన్ని వర్గాల వారిని రావణాసుర సినిమా ఆకట్టుకుంటుంది అనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా రవితేజ యొక్క రావణాసుర సినిమా యొక్క టీజర్ సినిమా పై అంచనాలు పెంచింది.ముఖ్యంగా టీజర్ లో రవితేజ పాత్ర గురించి ఆసక్తిరేపే విధంగా విజువల్స్ ఉన్నాయి.

డైలాగ్స్ కూడా రవితేజ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడా అనే అనుమానాలు కలిగించాయి.మొత్తానికి రవితేజ ఈ సినిమా తో మరోసారి మ్యాజిక్ చేసే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.ఈ సినిమా లో రవితేజ లాయర్ అనే విషయం తెల్సిందే.అయితే ఎలాంటి లాయర్ అనేది సస్పెన్స్ గా ఉంది.వచ్చే నెలలో రాబోతున్న ఈ సినిమా కోసం భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని రవితేజ భావిస్తున్నాడు.

ధమాకా సినిమాకు ముందు వరకు రవితేజ ఎక్కువగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు కాదు.కానీ ధమాకా సినిమాకు నెల రోజుల పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.రవితేజ ప్రమోషన్ కార్యక్రమాలు కచ్చితంగా ధమాకా సినిమా కి ఉపయోగపడింది.

కనుక రావణాసుర సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా రవితేజ అదే స్తాయిలో పాల్గొనాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఒక వేళ రవితేజ యాక్టివ్‌ గా ప్రమోషన్ చేస్తే రావణాసుర కి మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube