'మహా సముద్రం' రవితేజ జోస్యం నిజమైందా..!

కొన్ని సినిమాల ఫలితాలు కథల విన్న టైం లోనే రిజల్ట్ గెస్ చేసే అవకాశం ఉంటుంది.వారికి ఉన్న అనుభవం అలా చెప్పేలా చేస్తుంది.

లేటెస్ట్ గా శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన మహా సముద్రం సినిమా విషయంలో కూడా ఒక స్టార్ హీరో జోస్యం ఫలించిందని అంటున్నారు.ఇంతకీ మహా సముద్రం విషయంలో ఏ హీరో జోస్యం నిజమైంది అంటే అతనెవరో కాదు మాస్ మహరాజ్ రవితేజ అని తెలుస్తుంది.

Raviteja Prediction About Maha Samudram Result,Maha Samudram,Raviteja, Ajay Bhup

మహా సముద్రం కథని నాగ చైతన్య, నితిన్, రవితేజ ఇలా అందరి హీరోల దగ్గరకు తీసుకెళ్లాడు డైరక్టర్ అజయ్ భూపతి. అయితే కొందరు సోలో హీరో అయితే చేస్తామని ఆలా కథ మార్చమని అడిగారట.

రవితేజ అయితే సినిమా కథ బాగుంది కాని కొన్ని మార్పులు చేయమని అన్నారట.అయితే దానికి కుదరదని చెప్పిన అజయ్ భూపతి వేరే హీరోలను వెతుక్కున్నాడు.

Advertisement

సినిమా రిలీజ్ కు ముందు పక్కా హిట్ అనే బజ్ ఏర్పడినా ఆఫ్టర్ రిలీజ్ మహా సముద్రం నిరాశపరచింది.సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు.

ఫ్లాప్ టాక్ వచ్చిన పెళ్లిసందడికి మంచి కలక్షన్స్ వస్తుంటే మహా సముద్రం సినిమాకు పెద్దగా కలక్షన్స్ రావట్లేదు.అందుకే మహా సముద్రం రిజల్ట్ విషయంలో రవితేజ చెప్పిన జోస్యం గురించి మాట్లాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు