రవితేజ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఏమిటో తెలుసా?

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఇప్పటికే షూటింగ్‌ను మెజారిటీ శాతం పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

 Raviteja Krack Movie To Get Theatre Release, Raviteja, Krack Movie, Gopichand Ma-TeluguStop.com

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని టీజర్, ట్రైలర్ల వరకు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాతో మాస్ రాజా మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అయ్యాడు.

ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.

ఒకవేళ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే, రవితేజ క్రేజ్ తగ్గుతుందేమోనని ఫ్యాన్స్ భయపడ్డారు.కానీ చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఈ సినిమాలోని మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను బిగ్ స్క్రీన్‌పైనే చూడాలని, డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఈ సినిమాను చూస్తే అసలైన మజా రాదని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాలో అందాల భామ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాకు సంబంధించి కేవలం 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమాను ఆగస్టు తొలివారంలో షూటింగ్ నిర్వహించి వీలైనంత త్వరగా రిలీజ్‌కు రెడీగా చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube