మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు బాబీ దర్శకత్వం వహించాడు.
ఇక ఈ సినిమా లో కీలక పాత్ర ను మాస్ మహారాజా రవితేజ పోషించడం తో అంచనాలు మరింతగా పెరిగాయి.పోలీస్ ఆఫీసర్ పాత్ర లో రవితేజని దర్శకుడు చూపించ బోతున్నాడు.
చిరంజీవి మరియు రవితేజ కాంబినేషన్ లో గతం లో సినిమాలు వచ్చాయి.కానీ ఆ సమయం లో రవితేజ హీరో గా ఇంకా స్టార్ అవ్వలేదు.
ఇప్పుడు రవితేజ స్టార్ హీరో.అలాంటి రవితేజ, చిరంజీవి సినిమా లో నటించడం వల్ల కచ్చితంగా అంచనాలు భారీగా పెరుగుతాయి అని ముందే చిత్ర యూనిట్ సభ్యులకు తెలుసు.
అందుకు తగ్గట్టుగానే సినిమా ను తెరకెక్కించడం జరిగింది.

ఇక ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి తో పాటు రవితేజ కూడా స్టేజ్ షేర్ చేసుకునేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.రవితేజ అభిమానులతో పాటు చిరంజీవి అభిమానులు భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటికే వైజాగ్ లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆ మధ్య అధికారికంగా తెలియజేశారు.
రవితేజ కు జోడి గా కూడా ఒక హీరోయిన్ ఉంటుందని అంటున్నారు.దాదాపుగా 45 నిమిషాల స్క్రీన్ ప్రజెన్స్ ని రవితేజ కలిగి ఉంటాడు అంటే దాదాపు సెకండ్ హీరో అన్నట్లు.
కనుక ఈ సినిమా రవితేజ కు మరియు చిరంజీవి కి ఎంతో కీలకం అనడంలో సందేహం లేదు.ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.
చిరంజీవి మరియు రవితేజ కాంబో సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.







