రిజల్ట్ ఎలా ఉన్నా రవితేజ( Raviteja ) సినిమాల ప్లానింగ్ మాత్రం ఖతర్నాక్ గా ఉంటుంది.కెరీర్ లో హిట్లు ఫ్లాపులు సమతూకం చేస్తూ వెళ్తున్న రవితేజ ప్రస్తుతం సెట్స్ మీద రెండు సినిమాలు చేస్తున్నాడు.
అందులో టైగర్ నాగేశ్వర రావు ఒకటి కాగా రెండోది ఈగల్.ఈ రెండు సినిమాలు భారీ టార్గెట్ తో వస్తున్నాయి.
అంతేకాదు రెండు సినిమాలు చాలా బాగా వస్తున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.రవితేజ ఈ రెండు సినిమాల మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.
అయితే దసరాకి టైగర్ నాగేశ్వర రావు రిలీజ్ ఫిక్స్ చేశారు.దసరా బరిలో బాలయ్య భగవంత్ కేసరి( Bhagavanth Kesari )కి రవితేజ టైగర్ నాగేశ్వర రావు వస్తున్నాడు.
ఇక ఈగల్( Eagle ) సినిమా కూడా 2024 సంక్రాంతి కి రిలీజ్ ప్లాన్ చేశారు.సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నా సరే కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో సంక్రాంతి( Sankranthi Releases )కి రిలీజ్ లాక్ చేశారు.ఈ రెండు సినిమాల విషయంలో రవితేజ చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడని అనిపిస్తుంది.అందుకే రిలీజ్ డేట్ ల విషయంలో కూడా మరో మాట లేదన్నట్టు చెబుతున్నారు.
మేకర్స్ కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉండటంతో అనుకున్న డేట్ కే వచ్చేస్తారని తెలుస్తుంది.