మాస్ మహారాజ రవితేజ ‘కిక్ 2’ మరియు ‘బెంగాల్ టైగర్’ చిత్రాల ఫ్లాప్‌తో ఢీలా పడి పోయాడు.ఈయన ‘బెంగాల్ టైగర్’ పూర్తి అయిన వెంటనే ‘ఎవడో ఒక్కడు’ చిత్రం ప్రారంభం అవ్వాల్సి ఉంది.
కాని ఇప్పటి వరకు కూడా ఆ చిత్రం ప్రారంభం అయ్యింది లేదు.అందుకు సంబంధించిన చర్చలు మరియు సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం అందడం లేదు.
దాంతో ‘ఎవడో ఒకడు’ చిత్రం షూటింగ్ ప్రారంభంకు ముందే అటకెక్కింది అంటూ ప్రచారం జరుగుతోంది.
దిల్‌రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా అధికారిక ప్రకటన సైతం వచ్చింది.
హీరోయిన్స్‌గా ప్రగ్య జైశ్వాల్, అనుపమ పరమేశ్వరన్‌లు హీరోయిన్‌లుగా ఎంపిక అయ్యారు.కాని ‘బెంగాల్ టైగర్’ చిత్రం ఫలితం తర్వాత రవితేజ ఆలోచనలో మార్పు వచ్చిందని, అందువల్లే ‘ఎవడో ఒకడు’ చిత్రం ప్రారంభం కాకుండానే ఆగిపోయిందని సినీ వర్గాల వారు అంటున్నారు.
అయితే త్వరలోనే దిల్‌రాజు నిర్మాణంలో రవితేజ హీరోగా ఒక సినిమా రాబోతుందని విశ్వసనీయ సమాచారం అందుతోంది.ఆ సినిమాకు వేణు శ్రీరాం కాకుండా మరో దర్శకుడు పని చేయనున్నాడు.
త్వరలోనే ఆ సినిమాపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.







