నిర్మాతను పెళ్లి చేసుకున్న సీరియల్ నటి.. వాళ్ళిద్దరి పెళ్లిలో అదే ట్విస్ట్?

ప్రేమ,పెళ్లి, విడాకులు.ఈ మూడు పదాలు ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటాయి.

 Ravindar Chandrasekaran Mahalakshmi Wedding Pics Goes Viral, Ravindar Chandrasek-TeluguStop.com

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు ఏళ్ల తరబడి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత అనుకోని కారణాలవల్ల మనస్పర్ధలతో విడాకులు తీసుకొని విడిపోవడం అన్నది కామన్ గా మారిపోయింది.ఇక రాను రాను అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కనీసం ఏడాది కూడా కలిసి ఉండకముందే విడాకులు తీసుకుని విడిపోతున్నారు.

ఇప్పటికే ఇవి ఇండస్ట్రీలో ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు విడిపోయిన విషయం తెలిసిందే.ఒకప్పుడు పెళ్లి అంటే దానిని ఒక పరమ పవిత్ర బంధం గా భావించేవారు.

కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి అంటే అది ఏదో ఫ్యాషన్ గా మారిపోయింది.ఏదో ఫాస్ట్ గా ప్రేమించడం విడాకులు తీసుకుని ఫాస్ట్ గా విడిపోవడం అన్నది కామన్ గా మారిపోయింది.

ఇది కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం విడాకుల ట్రెండ్ ఎక్కువ అయిపోయింది.ప్రేమలు,పెళ్లిల్లు,బ్రేకప్ లు రెండో వివాహాలు ఇవన్నీ కూడా సర్వసాధారణమైపోయాయి.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు రెండో వివాహం చేసుకుని విడిపోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక తమిళ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Telugu Mahalakshmi, Pics-Movie

ఒక నిర్మాత ఒక నటిని పెళ్లి చేసుకున్నారు.అయితే ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా.ఆ ఇద్దరికీ ఇదివరకే పెళ్లిళ్లు అయ్య వారి భాగ్య స్వాములతో విడిపోయారు.ఇద్దరు రెండో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే వీరిద్దరి ఫోటో పెళ్లి ఫోటోలు చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.

కాగా తమిళ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత రవీందర్ చంద్రశేఖర్.సీరియల్ నటి విజే మహాలక్ష్మి ల పెళ్లి తాజాగా ఎంతో ఘనంగా జరిగింది.

వీరి పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు స్నేహితులు కూడా హాజరయ్యారు.కాగా ఆ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు చూసి కొంతమంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుండగా మరి కొంతమంది నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా నిర్మాత రవిందర్ తీయబోతోన్న రెండు సినిమాలలో విజే మహాలక్ష్మీ నటిస్తోందట.అయితే మహాలక్ష్మీ ఇది వరకే బుల్లితెర పై ప్రసారం అయ్యే పలు సీరియల్స్‌ నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube