మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ”ఆర్ఆర్ఆర్” సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ ను కొనసాగించడం కోసం ఈయన చాలానే కష్టపడుతున్నాడు.ప్రజెంట్ రెండు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా వాటిల్లో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో( Director Buchibabu ) చేస్తున్న మూవీ ఒకటి.
16వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు తెరకెక్కించ బోతున్నట్టు పలు వచ్చాయి.ఇప్పటికే పక్కా ప్రణాళికతో స్క్రిప్ట్ సిద్ధం చేయగా ప్రీ ప్రొడక్షన్ పనులతో టీమ్ అంతా బిజీగా ఉంది.
ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా.ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్( AR Rehman ) సంగీతం అందిస్తున్నాడు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ హీరోయిన్ గా నటించబోతుంది అనే టాక్ తెగ వైరల్ అవుతుంది.ఒకప్పటి హీరోయిన్ కూతురు చరణ్ కు జోడిగా ఎంపిక అయ్యింది అనే కథనాలు నెట్టింట వస్తున్నాయి.
ఆమె ఎవరో కాదు రవీనా టాండన్ కూతురు రాషా తడానీని( Rasha Thadani ) ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది.ఈ బ్యూటీకి ఇప్పుడు కేవలం 18 ఏళ్ళు మాత్రమే.ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా వెంటనే ఇలాంటి సినిమాలో అవకాశం లభించడం లక్ అనే చెప్పాలి.ఈమె మొన్ననే హైదరాబాద్ కూడా వచ్చారని లుక్ టెస్ట్ కోసమే రాషా తడానీ ఇక్కడికి వచ్చారని అంటున్నారు.
చూడాలి ఈ భామ నటనలో ఎలా మెప్పిస్తుందో.