''ఈగల్'' ఆడియో రైట్స్ భారీ ధరకు సోల్డ్.. ఎవరికీ సొంతం అయ్యాయంటే?

మాస్ మహారాజా రవితేజ ( Raviteja ) ఇటీవలే యంగ్ వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswar Rao ) సినిమాతో దసరా పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే అవ్వలేదు కానీ పర్వాలేదు అనిపించుకుంది.

 Ravi Teja’s Eagle Movie Audio Rights Sold, Eagle Movie Audio Rights, Tiger Nag-TeluguStop.com

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యిన వెంటనే మార్ప సినిమాను సంక్రాంతి పండుగకు ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రవితేజ తన నెక్స్ట్ సినిమాలను పూర్తి చేస్తున్నారు.ప్రస్తుతం రవితేజ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి.అందులో ”ఈగల్” ( Eagle Movie ) ఒకటి.

యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.

భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇటీవలే టీజర్ (Eagle Teaser) రిలీజ్ అవ్వగా ఈ సినిమాపై మరిన్ని హోప్స్ పెంచేశారు.కాగా తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు సోల్డ్ అయ్యినట్టు తెలుస్తుంది.

దవ్ జంద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఐకాన్ మ్యూజిక్ వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు తెలిపారు.అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameswaran ), కావ్య థాపర్( Kavya Thapar ) హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కాబోతుంది.

మరి ఈ సినిమాతో సంక్రాంతి పోటీలో రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube