మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.త్వరలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది.
దీని తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.
ఇందులో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే రవితేజ రీసెంట్ గా మారుతి చెప్పిన స్టొరీకి ఒకే చెప్పాడు.
ఈ సినిమాని వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నారు.కామెడీ, ఫ్యామిలీ కథలతో ప్రేక్షకులని మెప్పిస్తున్న దర్శకుడు మారుతి ఈ సారి రవితేజ కూడా అలాంటి ఫ్యామిలీ ఎలిమెంట్స్, మంచి కామెడీ ట్రాక్ ఉండే కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
దీంతో పాటు రవితేజ కెరియర్ లో చేయని పాత్రలో ఇందులో కనిపించనున్నాడు అని తెలుస్తుంది.
వినోదం, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూనే ఈ చిత్రంలో సామాజిక సందేశం ఉన్న కోర్ట్‌రూమ్ డ్రామా కథాంశాన్ని ఉండబోతుంది అని తెలుస్తుంది.
ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు.తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ ని టచ్ చేస్తున్న మారుతి ఈ సినిమాలో కూడా కుటుంబ విలువలు గురించి పరిచయం చేస్తూనే సోషల్ మెసేజ్ ఇబ్బబోతున్నాడు అని తెలుస్తుంది.
ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాబోతున్నాయి.మొత్తానికి రవితేజ కెరియర్ లో ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో కనిపించబోతూ ఉండటం ఫ్యాన్స్ కి కాస్త ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉంది.
ఎలాంటి పాత్రని అయిన తన ఎనర్జీతో మరో లెవల్ కి తీసుకుపోయే సామర్ధ్యం రవితేజ దగ్గర ఉందని, కోర్టు డ్రామా ఎపిసోడ్ రవితేజ ఉంటే ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంటుందని భావిస్తున్నారు.