'టైగర్ నాగేశ్వరరావు' నుండి మోస్ట్ ఏవైటెడ్ అప్డేట్.. రివీల్ చేసిన మేకర్స్!

మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.

( Tiger Nageswara Rao ) ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.

నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి.ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లింప్స్ తో అంచనాలు డబుల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా మాస్ రాజా ఫ్యాన్స్ అంతా ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.మరి ఈ రోజు మేకర్స్ నెక్స్ట్ అప్డేట్ గురించి సమాచారం ఇచ్చారు.

ఈ సినిమా నుండి ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు మోస్ట్ ఏవైటెడ్ అప్డేట్ ను రివీల్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.మరి ఈ అప్డేట్ ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

సాయంత్రం వరకు వేచి ఉంటే ఈ అప్డేట్ ఏంటో తెలుస్తుంది.ఇక నిజ జీవిత సంఘటనలతో 1970ల కాలంలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా( Tiger Nageswara Rao Biopic ) తెరకెక్కుతున్న ఈ సినిమాలో నుపుర్ సనన్,( Nupur Sanon ) గాయత్రీ భరద్వాజ్( Gayatri Bharadwaj ) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అక్టోబర్ 20న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

అలాగే ఈ సినిమాను అగర్వాల్ ఆర్ట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.ఇక మాస్ రాజా ఈ సినిమాతో పాటు పలు సినిమాలను లైన్లో పెట్టి వాటిని కూడా పూర్తి చేస్తున్నాడు.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ సినిమాతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు