మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja )హీరో గా వంశీ దర్శకత్వం ( Vamsi )లో రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు.ఇది ఒక బయోపిక్ అంటూ మొదట ప్రచారం చేశారు.
అయితే సినిమా విడుదల అయిన తర్వాత అసలు విషయాన్ని చెప్పారు.సినిమా కథ ను టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) గురించి తీసుకున్నారు… కానీ నిజం ఎంత వరకు ఉంది అనేది క్లారిటీ లేదు అన్నట్లుగా ముందే దర్శకుడు చెప్పేశాడు.
నాగేశ్వరర రావు సినిమా కథ గురించి చాలా తక్కువ విషయాలు తెలుసు.ఆ విషయాలను మేము తీసుకుని, కల్పిత కథల గురించి తెలుసుకుని సినిమా ను రూపొందించాం అంటూ చెప్పుకొచ్చారు.
అన్నట్లుగానే కథ ను తమ ఇష్టానుసారంగా మార్చేసుకుని సినిమా ను రూపొందించారు.
సినిమా లో రవితేజ ఇంట్రడక్షన్ సన్నివేశం కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక రవితేజ సన్నివేశాలే కాకుండా మొత్తం ఫస్ట్ హాఫ్ కి మంచి టాక్ వచ్చింది.అందుకే సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు.
కానీ పాన్ ఇండియా రేంజ్ లో సినిమా వసూళ్లు దక్కించుకోవడం లో విఫలం అయింది.తెలుగు రాష్ట్రాల్లో మరియు యూఎస్ బాక్సాఫీస్( US box office ) వద్ద మాత్రం మంచి వసూళ్లు సాధించింది.
వంద కోట్ల వసూళ్ల కు ఈ సినిమా కచ్చితంగా చేరువ అవుతుందని అంతా భావించారు.కానీ కొన్ని కారణాల వల్ల సినిమా బాక్సాఫీస్ ఆశించిన స్థాయి లో సత్తా చాటలేక పోయింది.
అయితే తదుపరి వారం లో పెద్ద సినిమా లు లేకపోవడం తో టైగర్ నాగేశ్వరరావు కి వంద కోట్ల వసూళ్లు సాధ్యం అయ్యేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇంకో 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తే వంద కోట్ల క్లబ్ లో టైగర్ నాగేశ్వరరావు ఉండబోతున్నాడు అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.