మాస్ మహా రాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు ( Tiger nageshara rao movie )చిత్రం నిన్న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.వంశీ ( Vamsi )దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
కొందరు మాత్రమే ఎప్పటిలాగే సినిమా కి నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు.ఎవరు ఎలా మాట్లాడినా సినిమా లో వచ్చే రవితేజ ఇంట్రడక్షన్ సన్నివేశం మాత్రం అదిరి పోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రతి ఒక్కరు కూడా ఆ సన్నివేశం సూపర్ హిట్ అంటూ దర్శకుడి ని అభినందిస్తున్నారు.అంతే కాకుండా రవితేజ( Ravi teja ) ను ఆ సన్నివేషంలో చూపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటూ రివ్యూవర్స్ కూడా అభినందిస్తున్నారు.కేవలం ఆ ఒక సన్నివేశం మాత్రమే కాకుండా సినిమా మొదటి భాగం మొత్తం కూడా ప్రేక్షకులను రంజింప చేసే విధంగా ఉంది.కానీ రెండవ సగానికి వచ్చేప్పటికి ప్రేక్షకులకు నస పెట్టినట్లుగా ఇబ్బంది… పెట్టినట్లుగా అనిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొదటి భాగం మాదిరిగా రెండవ భాగం కూడా ఉండి ఉంటే కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి రూ.200 నుండి 300 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి భారీ వసూళ్లని సొంతం చేసుకుంటుంది అనుకున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger nageshara rao movie ) బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు కలెక్షన్స్ ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.అది కూడా ఫస్ట్ హాఫ్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం వల్లే ఆ కలెక్షన్స్ రాబోతున్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దసరా పండుగ ఇతర కారణాల వల్ల సినిమా కు మంచి ఓపెనింగ్స్ అయితే లభించాయి.ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతుంది అనేది చూడాలి.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కు బాలకృష్ణ ( Balakrishna )నటించిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) పోటీ గా ఉంది.మరి ఆ పోటీని తట్టుకొని ఈ సినిమా ఎలా నిలుస్తుంది అనేది అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.