ప్రస్తుత కాలంలో ప్రేమించుకోవడం పెళ్లిళ్లు చేసుకోవడం లేదా ప్రేమకు బ్రేకప్ చెప్పుకోవడం అంటివి సర్వసాధారణ జరుగుతున్నాయి.ఇలా ఎంతోమంది ప్రేమలో పడి బ్రేకప్ చెప్పుకున్న వారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు ఇలాంటి వారిలో నటి రవీనా టాండన్ ( Raveena Tandon ) కూడా ఒకరు.
ఈమె కెరియర్ మొదట్లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ( Akshay Kumar ) తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.ఇలా ప్రేమించుకున్నటువంటి ఈ జంట పెళ్లి కూడా చేసుకోవాలని భావించి ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు అయితే కొన్ని విభేదాల కారణంగా వారి నిశ్చితార్థం బ్రేకప్ చెప్పుకొని అనంతరం వీరిద్దరూ మరొకరితో డేటింగ్ లో ఉంటూ పెళ్లిలో చేసుకున్నారు.

ఈమె 2004వ సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి అనిల్ తడాని( Anil Thadani )నీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.ఇక ఈ దంపతులకు ఇద్దరు సంతానం.ఇక రవీనా పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని( ADoption ) వారికి కూడా తల్లిగా మారారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మాట్లాడుతూ తన ప్రేమ కహానీల గురించి నేను నా పిల్లలకు ఎప్పుడు అన్ని విషయాలు చెబుతాను వారి దగ్గర ఏ విషయం కూడా దాచనని చెప్పారు.
గతంలో తనకు ఉన్నటువంటి ప్రేమలు ఎఫైర్స్ గురించి అన్ని విషయాలు వారికి తెలుసని రవీణ వెల్లడించారు.

నా ప్రేమ గురించి అఫైర్స్( Affairs ) గురించి ఎన్నో పేపర్లలో కథలు కథలుగా రాస్తారో అవి వారు చూసి కంగారుపడి నన్ను ప్రశ్నించడం కంటే ముందుగానే నేను వారికి ఆ విషయం చెప్పేస్తే ఎలాంటి బాధ ఉండదు పేపర్లో ఆ విషయం వచ్చినప్పుడు నేను వారికి చెప్పకుండా దాయలేను అందుకే అన్ని విషయాలు ముందుగానే చెబుతానని ఈమె తెలిపారు.90 లలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవే అప్పట్లో నా గురించి ఎన్నో చెత్త వార్తలు రాసేవారు.బాడీ షేమింగ్ గురించి మాత్రమే కాకుండా ఎన్నో తప్పుడు వార్తలను రాసేవారని, ఇప్పుడు అయితే సోషల్ మీడియా ఉంది కనుక ఆ వార్తలను ఖండించే అవకాశం ఉంది.
అప్పట్లో ఇలాంటి అవకాశం లేదు కనుక నా పిల్లలకు అన్ని విషయాలు నేను చెప్పే దానిని అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.