ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క సినిమాలో కూడా లిప్ లాక్( Lip Lock ) సన్నివేశాలు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది.ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలలో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలను( Romantic Scenes ) జోడిస్తున్నారు.
ఇలాంటి సీన్లలో నటించడానికి సెలబ్రిటీలు సైతం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు కానీ అదనంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.అయితే ఇలాంటి సీన్స్ తెరపై చూడటానికి బాగానే అనిపించిన ఈ సీన్స్ చేయడం కోసం వారు ఎంతో ఇబ్బందులు పడతారనే విషయం మనకు తెలిసిందే.
ఇలా ఇప్పటికే ఎంతోమంది లిప్ లాక్స్ సన్ని వేషాలు వెనుక ఉన్నటువంటి కష్టాన్ని బయటపెట్టారు.తాజాగా కేజిఎఫ్ నటి రవీనా టాండన్ సైతం తన తొలి లిప్ లాక్ ఎక్స్పీరియన్స్ బయట పెట్టారు.

రవీనా టాండన్ ( Raveena Tandon ) సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నట్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈమె హీరోయిన్గా కెరియర్ లో కొనసాగుతున్నప్పటికీ నో కిస్సింగ్ రూల్స్ ( No Kissing Rules )పాటించేది.ఎలాంటి సినిమా అయినా కానీ తాను లిప్ లాక్ సన్నివేశాలలో నటించకూడదని రూల్ పెట్టుకున్నారు అయితే కొన్నిసార్లు మనం మన రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుంది అని సెలబ్రిటీలు పలు సందర్భాలలో తమ రూల్స్ బ్రేక్ చేసే లిప్ లాక్స్ సన్ని వేశాలలో నటించారు.ఈ విధంగానే రవీనా టాండన్ కూడా ఒక సినిమాలో ఒక హీరోతో కలిసి లిప్ లాక్ సీన్స్ చేశారట.

ఇలా ఆ హీరో తో కలిసి లిప్ లాక్ సన్నివేశాలలో నటిస్తున్న సమయంలో నా పెదవులు ఆయనకు తగలగానే ఎంతో అభ్యంతరకరంగా అనిపించింది.ఇందులో ఆయన తప్పు లేకపోయినా నాకు మాత్రం చాలా అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే వెళ్లి వాంతి చేసుకున్నానని ఆ క్షణం నా నోటిని ఒక వంద సార్ల శుభ్రం చేసుకుంటే బాగుండు అనిపించింది అంటూ ఈ సందర్భంగా తన ఫస్ట్ లిప్ లాక్ సన్నివేశం గురించి రవీనా టాండన్ మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.