మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘రావణాసుర‘.గత మూడు నెలలోనే రెండు సినిమాలతో వచ్చి సూపర్ హిట్స్ అందుకున్న రవితేజ మరో హిట్ కోసం రెడీ అయ్యాడు.
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వచ్చిన సక్సెస్ ను కంటిన్యూ చేయడానికి సిద్ధం అవుతున్నారు.
ఈ క్రమంలోనే రావణాసుర సినిమా కోసం మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టు కున్నాయి.ఇక ఇప్పుడు టీజర్ కూడా వచ్చేసింది.ఈ టీజర్ రవితేజ సినిమాల్లోనే భిన్నంగా అనిపిస్తూ అందరిని ఆకట్టు కుంటుంది.

ఈ టీజర్ లో రవితేజను ఒక పవర్ ఫుల్ క్రిమినల్ లాయర్ గా అనేక హత్యలకు కారణం అయిన వ్యక్తంగా చూపించారు.సాలిడ్ విజువల్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ తోనే గూస్ బంప్స్ తెప్పించారు.ఇప్పటి వరకు ఈ సినిమాపై లేని అంచనాలను టీజర్ తో పెంచేశారు.
చూడాలి మరి రవితేజ తన సక్సెస్ ను కొనసాగిస్తాడో లేదో.ఇదిలా ఉండగా ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటిస్తుండగా.హర్ష వర్ధన్, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు.అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తుండగా.ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా రావణాసుర సినిమా రిలీజ్ కాబోతుంది.







