మాస్ మహారాజా రవితేజ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కెరీర్ లోనే మంచి ఫామ్ లో ఉన్నాడు.
ధమాకా, వాల్తేరు వీరయ్య’ వంటి రెండు వరుస సినిమాలతో 100 కోట్ల విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు రవితేజ.మరి ఇలా వెంటవెంటనే హిట్స్ అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్న మాస్ రాజా ఇదే ఫామ్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.
ఇక ఈ రోజు మాస్ రాజా రవితేజ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే.ఈయన బర్త్ డే కానుకగా రవితేజ కొత్త సినిమా నుండి ఫ్యాన్స్ కోసం అప్డేట్ వచ్చేసింది.
ప్రెజెంట్ రవితేజ లైనప్ లో ఉన్న చిత్రాల్లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ”రావణాసుర”.ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ రోజు ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చారు మేకర్స్.జనవరి 26న రవితేజ తన 55వ పుట్టిన రోజును జరుపు కుంటున్నారు అనే విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్.
బ్లాక్ సూట్ ధరించి రవితేజ మంచి స్టైలిష్ లుక్ లో కనిపించాడు.సస్పెన్స్ కాన్సెప్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నారు.

పది రకాల గెటప్ లలో మాస్ రాజా రవితేజ కనిపించనున్నట్టు తెలుస్తుంది.అందుకే రావణాసుర అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు.ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటిస్తుండగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నాడు.







