Rathika: ఆ కంటెస్టెంట్లతో పోలిస్తే రతిక చాలా బెటర్.. బిగ్ బాస్ 7 టీమ్ పై ట్రోల్స్ మామూలుగా లేవుగా!

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) రసవత్తరంగా సాగుతోంది.చూస్తుండగానే అప్పుడే నాలుగు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

 Rathika Eliminated Netizens Massive Trolling On Bigg Boss 7-TeluguStop.com

ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.తాజాగా బిగ్ బాస్ నాలుగవ వారం ఎలిమినేషన్ కూడా పూర్తి అయ్యింది.

ఇది ఇలా ఉంటే ఈసారి ఉల్టా పుల్టా అంటూ షోని మొదలుపెట్టినప్పటికీ అన్ని సీజన్ లాగే ఈ సీజన్ కూడా చాలా బోరింగ్ గా ఉంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.నాగార్జున( Nagarjuna ) హోస్టింగ్ కూడా బోర్ కొట్టేస్తుంది, వీక్ డేస్ మాత్రమే కాదు.

Telugu Bigg Boss, Eliminate, Prince Yawar, Rathika, Rathika Rose, Sivaji, Tasty

వీకెండ్ ఎపిసోడ్స్ కూడా బోర్ కొట్టేస్తున్నాయి అనే మాట సోషల్ మీడియాలోనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.పూర్ టిఆర్పీ తో బిగ్ బాస్ సీజన్ 7 రన్ అవుతోంది.మరోపక్క వరసగా లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడంపై కూడా నెటిజెన్స్ నుంచి ట్రోలింగ్ మొదలైంది.అందులోను తాజాగా రతిక( Rathika ) ఎలిమినేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హౌస్ లో టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ లు హౌస్ లో ఎంటర్టైన్ చెయ్యడమే లేదు.శివాజీ( Sivaji ) అయితే కంటెస్టెంట్ గా కూడా పనిరాడు.

ఆయన పంచాయితీలు చేస్తూ, ఏదో అలా అలా మేనేజ్ చేస్తున్నాడు.అలాంటివాళ్ళని ఎలిమినేట్ చెయ్యకుండా రతికని ఎలిమినేట్ చెయ్యడమేమిటి? అంటూ కొందరు షో నిర్వహకులపై మండిపడుతున్నారు.

Telugu Bigg Boss, Eliminate, Prince Yawar, Rathika, Rathika Rose, Sivaji, Tasty

అసలు రతిక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో( Pallavi Prasanth ) స్నేహం, అతనితో వైరమే ఆమె కొంపముంచింది.అనవసరపు అతి ఆమెని ఎలిమినేట్ అయ్యేలా చేసింది.కానీ ఆమె టాస్క్ ఆడకపోయినా కనీసం తాను ఎవరి మీద ఆధారపడకుండా ఇండివిడ్యువల్ గా ఆడుతుంది.ఆలోచన శక్తి లేని యావర్, బద్దకానికి కేరాఫ్ టేస్టీ తేజ, టాస్క్ ఆడని శివాజికి కన్నా రతిక చాలా బెటర్ అంటూ నెటిజెన్స్ బిగ్ బాస్ యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తున్నారు.

ఈ విషయంపై చాలా దారుణంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube