హ్యాపీ వాలెంటైన్స్ మై లవ్స్ అంటూ రష్మిక పోస్ట్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

మామూలుగా సెలబ్రెటీలు ఎవరినో ఒకరిని ఇష్టపడుతూ ఉంటారు.కానీ ఆ విషయాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు.

 Rashmikas Post Saying Happy Valentines My Loves Netizens Trolling, Rashmika Post-TeluguStop.com

ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మాత్రం తమ వ్యక్తిగత విషయాలను అంతగా బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు.ఒకవేళ తమ రహస్యాలు బయటపడితే కూడా వాటిని కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

అయితే ఇదంతా పక్కన పెడితే ఈరోజు ప్రేమికుల రోజు అన్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా తము ప్రేమించిన వ్యక్తులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాలో హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ తెగ పోస్టులు షేర్ చేస్తున్నారు.ఇక కొందరు మాత్రం తమకు లవ్ లేదని.

తమను తామే ప్రేమించుకుంటున్నాము అని.తమకు తామే వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.

దీంతో నెటిజెన్స్ వారిని బాగా ట్రోల్స్ చేస్తున్నారు.నటిస్తున్న నాటకాలు చాలు అంటూ.పది మందితో తిరిగే మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉండరా అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన కూడా  వాలెంటైస్ డే సందర్భంగా ఒక వీడియో షేర్ చేస్తూ విష్ చేసింది.

దీంతో నెటిజన్స్ ఆమెను బాగా టార్గెట్ చేసి తెగ ఆడుకుంటున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.

సొంత భాషలో కంటే తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది.

ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంది.ఇక కొంతమంది అబ్బాయిలకు ఈ బ్యూటీ క్రష్.

కానీ కొంతమంది మాత్రం ఈమెను ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు.

రష్మిక గతంలో వ్యక్తిగతంలో చాలా హాట్ టాపిక్ గా నిలిచింది.అంతేకాకుండా ఈమె చేసే అతి జనాలకు అసలు నచ్చదు.అయితే ఈమె గతంలో తనతో కలిసి నటించిన విజయ్ దేవరకొండ తో రిలేషన్ షిప్ లో ఉంది అని బాగా వార్తలు వచ్చాయి.

కానీ తమ మధ్య అటువంటిది ఏమీ లేదు అంటూ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తూనే ఉంది.కానీ వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, కలిసి ఉన్న సందర్భాలను చూసి ఇద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారు అని అనుకుంటున్నారు.

కానీ ఈ బ్యూటీ మాత్రం ఈ విషయంలో బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది.అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తే సందడి చేస్తూ ఉంటుంది.

ఇక ఈరోజు ప్రేమికుల రోజు సందర్బంగా ఆమె ఒక వీడియో షేర్ చేసుకుంది.

అందులో తన పెంపుడు కుక్కతో బెడ్ పై పడుకొని ఆట ఆడుతూ కనిపించింది.అంతేకాకుండా.హ్యాపీ వాలంటైన్స్ డే నా నుండి నా లవ్ కు అంటూ హార్ట్ సింబల్ తో క్యాప్షన్ పెట్టింది.

దీంతో నీ లవ్ అంటే విజయ్ దేవరకొండనే కదా.మరి నేరుగా ఆయనను ట్యాగ్ చేసి పెట్టొచ్చు కదా.ఎందుకు ఈ దాగుడుమూత ఆటలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొంతమంది నువ్వు నీ పెంపుడు కుక్క ఒకేలా ఉన్నారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube