కాంతారా సినిమాపై నోరు పారేసుకోవడం, కన్నడ ఇండస్ట్రీపై కోట్లాటకు వెళ్లడం, రిషబ్ శెట్టితో గోక్కోవడం వంటి వార్తలు చూశాక రష్మిక కాస్త తింగర పిల్ల అని అనుకుంటారు కానీ ఆమె మహా ముదురు అని ప్రస్తుతం తెలుస్తోంది.తమిళంలో నటించిన వారసుడు సినిమా ఆ భాషలో మినహా అన్ని భాషల్లో డిజాస్టర్ ఫలితాన్ని చవి చూసింది.
మరి ఆ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ మెయిన్ హీరోయిన్ తక్కువ అన్నట్టుగా రష్మిక పాత్ర ఉంటుంది.అందులో రంజితమే సాంగ్ మినహా ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.

తెలిసి తెలిసి అలాంటి ఒక చిన్న పాత్రలో ఎందుకు నటించింది అనే ప్రశ్నకు రష్మిక బదులు ఇచ్చింది.నాకు ముందుగానే తెలుసు ఆ సినిమాలో నాకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుందని.నాకు విజయ్ తో నటించడం మాత్రమే కావాలి.మిగతా విషయాలతో నాకు సంబంధం లేదు అంటూ కుండబద్దలు కొట్టింది.దీన్ని బట్టి చూస్తే రష్మిక స్ట్రాటజీ ఏంటో అర్థం చేసుకోవచ్చు.తమిళంలో స్టాండ్ తీసుకోవాలి అంటే ఒక స్టార్ హీరోలో నటించి ఉండాలి.
అందుకే ప్రాధాన్యత తగ్గినా సరే విజయ్ తో నటిస్తే ఆమెకు మరికొన్ని బ్యానర్లు పిలిచి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది.

ఇక ఇప్పటికే తెలుగులో ఆమె ఒక సూపర్ స్టార్ హీరోయిన్.పుష్ప సినిమాతో తెలుగుతో పాటు హిందీలో కూడా ఒక వెలుగు వెలిగే పరిస్థితి ఉంది.హిందీలో కూడా రెండు మూడు ప్రాజెక్టులు ఓకే చేసుకుంది.
కేఆర్కే లాంటి రివ్యూవర్స్ మాత్రం రష్మికను ఒక భోజ్ పూరి సరుకు అంటూ తీసేశారు.దీన్ని బట్టి అక్కడ ఒక క్రేజ్ వస్తుంది కాబట్టి తట్టుకోలేక కామెంట్స్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
ఇలా తెలుగు తమిళం హిందీలో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ దూసుకుపోతోంది.కన్నడ తన సొంత భాష కాబట్టి కాస్త టైం తీసుకుని సెట్ రైట్ చేయొచ్చు.
అలా నాలుగు భాషల్లో నటిస్తే పాన్ ఇండియా వ్యాప్తంగా ఆమెకు డిమాండ్ వచ్చి డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయి.ఇంకా ఏం కావాలో చెప్పండి ఒక హీరోయిన్ కి.







