అల్లు అర్జున్ తో డాన్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను.. రష్మిక సంచలన వ్యాఖ్యలు!

అల్లు అర్జున్( Allu Arjun ) రష్మిక( Rashmika ) హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా ఇప్పటివరకు 1700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టిస్తుంది.

ఇకపోతే ఈ సినిమా కారణంగా అల్లు అర్జున్ వివాదంలో కూడా చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా ఈ సినిమాలోనీ పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో పీలింగ్స్ పాట( Peelings Song ) కూడా భారీగా ట్రెండ్ అవుతుంది.ఇక ఈ పాటలో రష్మిక అల్లు అర్జున్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారని చెప్పాలి.

Rashmika Sensational Comments On Dance With Allu Arjun Details,allu Arjun, Rashm

తాజాగా ఈ పాట షూటింగ్ గురించి అలాగే అల్లు అర్జున్ తో డాన్స్ చేయడం గురించి రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఫీలింగ్స్ సాంగ్ విడుదలకు కొద్ది రోజుల ముందు షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు.ఈ పాట షూటింగ్ పూర్తి చేయడానికి ఐదు రోజుల సమయం పట్టిందని రష్మిక తెలిపారు.

Advertisement
Rashmika Sensational Comments On Dance With Allu Arjun Details,Allu Arjun, Rashm

అల్లు అర్జున్ లాంటి టాప్ డ్యాన్సర్ తో ఊర మాస్ సాంగ్ చేయడం నా అదృష్టం గా భావించాను.

Rashmika Sensational Comments On Dance With Allu Arjun Details,allu Arjun, Rashm

ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభంలో అల్లు అర్జున్ గారితో డాన్స్ చేయడానికి నేను చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను అలాగే చాలా భయంగా కూడా ఉండేదని తెలిపారు.చిన్నప్పటినుంచి కూడా నన్ను ఎవరైనా పైకి ఎత్తుకుంటే నేను ఎక్కడ పడేస్తారేమోనని ఎంతో భయపడేదాన్ని ఇక ఈ పాటలో అల్లు అర్జున్ సార్ నన్ను ఎత్తుకొని మరి డాన్స్ చేశారు ఆ సమయంలో చాలా భయపడిపోయానని రష్మిక తెలిపారు.ఇలా భయపడుతూ ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది.

కానీ ఆ తర్వాత అలవాటు చేసుకొని నార్మల్ అయ్యాననీ తెలిపారు.ఇక ఈ పాట మాత్రం ఎంతో అద్భుతంగా వచ్చి ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేస్తుందని ఈ సందర్భంగా రష్మిక ఫీలింగ్స్ సాంగ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు