ఆ సినిమాల గురించి నోరు విప్పని రష్మిక..?

చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్నా.

బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మికకు వరుస ఆఫర్లు వస్తుండగా అక్కడ 5 కోట్ల రూపాయలకు పైగా రష్మిక పారితోషికం తీసుకుంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం రష్మిక కన్నడలో 75 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా తీసుకుంటున్నారని సమాచారం.తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులత్ చాట్ చేసిన రష్మికకు బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

అయితే అభిమానులు ఎన్ని ప్రశ్నలు అడిగినా రష్మిక ఆ ప్రశ్నలకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అభిమానులు తన వర్క్ కు సంబంధించి ఎటువంటి కొత్త విషయాలు తెలుసుకోలేరని.

ఆ సినిమా మేకర్లు అనుమతి ఇస్తే తప్ప వాటి గురించి తాను వెల్లడించనని రష్మిక అన్నారు.

Rashmika Refuses To Talk About New Bollywood Projects, Bollywood Projects, Ntr T
Advertisement
Rashmika Refuses To Talk About New Bollywood Projects, Bollywood Projects, Ntr T

మేకర్స్ నుంచి అధికారికంగా బాలీవుడ్ సినిమాలకు సంబంధించి వెల్లడయ్యే వరకు ఏం చెప్పకూడదని రష్మిక భావిస్తున్నారు.తన సినిమాలకు సంబంధించి ఎలాంటి విషయాలను అడగవద్దని అభిమానులకు ఆమె స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న పుష్ప సినిమాలో, శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు.

ఈ ఏడాది ఆమె నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి.గతేడాది రష్మిక హీరోయిన్ గా నటించి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి.

ప్రస్తుతం రష్మిక వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.బాలీవుడ్ లో రష్మిక నటించిన సినిమాలు హిట్టైతే మాత్రం మరో నాలుగేళ్ల పాటు రష్మిక కెరీర్ కు ఢోఖా ఉండదనే చెప్పాలి.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనుందని ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు