కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి నటి రష్మిక ( Rashmika ) ప్రస్తుతం నేషనల్ వివిధ భాష చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి రష్మిక ఇటీవల అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్నారు.
తాజాగా ఈమె గురించి ఫోర్బ్స్ జాతీయ మీడియా పత్రికలో తన గురించి ఆర్టికల్ కూడా ప్రచురితమైన సంగతి తెలిసిందే.ఇకపోతే తాజాగా ఇటలీలోని మీలాన్ నగరంలో జరిగినటువంటి ఫ్యాషన్ షోలో పాల్గొని సందడి చేసింది.
ఫిబ్రవరి 20 నుంచి 26వరకు జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన మిలాన్ ఫ్యాషన్ వీక్ 2024 ( Milan Fashion Week 2024 )లో పాల్గొని ర్యాంప్‌పై వాక్ చేసింది.
ఈమె ప్రస్తుతం జపనీస్ ఫ్యాషన్ లేబుల్ అయిన ఒనిత్సుకా టైగర్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.నేపథ్యంలో తన బ్రాండ్ తరఫున ఈ ఫ్యాషన్ షోలో పాల్గొంది.బ్లాక్ డ్రెస్, షార్ట్ హెయిర్ స్టైల్‌తో ర్యాంప్‌పై వాక్ చేసి సందడి చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విధమైనటువంటి ఫ్యాషన్ షో లలో టాలీవుడ్ హీరోయిన్లకు చాలా తక్కువగా అవకాశాలు వస్తుంటాయి.అయితే ఈ అరుదైన అవకాశాన్ని రష్మిక అందుకొని మరో రికార్డ్ సాధించారు.ప్రస్తుతం రష్మిక ఈ ఫ్యాషన్ షో కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ఇక త్వరలోనే పుష్ప2 ( Pushpa 2 )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.