కన్నడ బ్యూటీ రష్మిక మందన తెలుగులో ఛలో మరియు గీతా గోవిందం సినిమాలతో సక్సెస్ దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా మారి పోయిన విషయం తెలిసిందే.మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమా లో నటించిన రష్మిక మందన అల్లు అర్జున్ తో పుష్ప సినిమా లో నటించి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు తక్కించుకుంది.
అలాంటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.గతంలోనే కమిట్ అయిన పుష్ప 2 సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
బాలీవుడ్ లో కమిట్ అయిన రెండు మూడు సినిమాల్లో ఇప్పటికే కొన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చాయి.ఇక మరికొన్ని సినిమాల పరిస్థితి ఏంటో అనే ఆసక్తి నెలకొంది.
తెలుగు లో ఈమె నటిస్తున్న పుష్ప 2 సినిమా సక్సెస్ అయి.ఆ సినిమా లోని ఈమె పాత్ర కు మంచి టాక్ దక్కితే తప్పితే కెరియర్ లో ముందడుగు వేసే పరిస్థితి లేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే రష్మిక మందన యొక్క క్రేజ్ తగ్గి ఆఫర్లు కూడా తగ్గుతున్నాయి.ఈ క్రమంలో వెంటనే రష్మిక ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకోవాల్సిన అవసరం ఉంది.ఒక వైపు ఆఫర్స్ తగ్గాయని ప్రచారం జరుగుతూ ఉంటే ఆమె మాత్రం తన పారితోషికాన్ని మూడు కోట్ల నుండి నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ మధ్య కాలం లో రష్మిక మందన భారీ సినిమాల్లో నటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

హిందీ లో ఒకటి రెండు చిన్న సినిమాలు కమిట్ అయింది.అలాగే యానిమల్ అనే ఒక పెద్ద హిందీ సినిమా చేస్తుంది.ఇక తెలుగు విషయానికొస్తే ఆమె చాలా తక్కువ సినిమాలను చేస్తుంది.అయినా కూడా అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని అభిమానులు వారికి వారు సర్దు చెప్పుకుంటున్నారు.
పుష్ప 2 సినిమా తర్వాత శ్రీవల్లి రష్మిక మందన పరిస్థితి ఏంటి అనేది చూడాలి.







