టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
తెలుగు తమిళం, హిందీ భాషల్లో వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.ఇకపోతే గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాతో రష్మిక మందన పాన్ ఇండియా హీరోయిన్గా మారిన విషయం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత రష్మిక క్రేజ్ మరింత పెరిగింది.దాంతో ఈమెకు బాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమా అవకాశాలు వచ్చి చేరుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇటీవల రష్మిక మందన నటించిన వారిసు సినిమా తమిళంలో విడుదలైన విషయం తెలిసిందే.

ఇదే సినిమాని తెలుగులో వారసుడు పేరుతో విడుదల చేశారు.అలాగే రష్మిక మందన నటించిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది ఈ బ్యూటీ.
కెరియర్ పరంగా ఎంత బిజీబిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన ఎన్నో విషయాలను పంచుకోవడంతో పాటు తన చేతిపై ఉన్న టాటూ గురించి కూడా స్పందించింది.

ఈ సందర్భంగా రష్మిక మందన మాట్లాడుతూ.మొదటి నాకు టాటూ వేయించుకోవాలని ఉండేది కాదు.మా కాలేజీలో ఒక అబ్బాయి ఆడపిల్లలు బాధను ఓర్చుకోలేదు.వాళ్లకు సూదులు అన్న భయమే అని అన్నాడు.అది తప్పని నిరూపించాలని నేను వేయించుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చింది రష్మిక మందన.అప్పుడు టాటూ ఏం వేయించుకోవాలో తెలియలేదు.
చాలాసేపు ఆలోచించిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది.ఎవరు మరొకరిని భర్తీ చేయలేరని నేను అనుకుంటాను.
ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే.అందుకే అదే అర్థం వచ్చే విధంగా ఇర్రిప్లేసబుల్ అనే పదాన్ని వేయించుకున్నాను అని తన టాటూ వెనుక రహస్యాన్ని చెప్పుకొచ్చింది రష్మిక మందన.