హిందీ జెర్సీ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి కారణం అదే.. అసలు విషయం బయట పెట్టిన రష్మిక!

డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ.ఈ సినిమా తెలుగులో ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.

 Rashmika Mandanna Open Up Jersey Movie Offer Reject Netizens Appreciation Rashmi-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేశారు.ఇక హిందీలో షాహిద్ కపూర్,మృణాల్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని చెప్పాలి.ఇదిలా ఉండగా ఈ సినిమా మొదట్లో మృణాల్‌ ఠాకూర్‌ స్థానంలో నేషనల్ క్రష్ రష్మికకు అవకాశం కల్పించారు.

జెర్సీ సినిమా ఆఫర్ రావడంతో రష్మిక ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.అయితే రష్మిక ఈ సినిమాని రిలీజ్ చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు మాత్రం తెలియకపోయినప్పటికీ, తాజాగా ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ విషయంపై రష్మిక స్పందించి అసలు విషయం బయట పెట్టారు.

ఈ సందర్భంగా జాతీయ మీడియాతో ముచ్చటించిన రష్మిక మాట్లాడుతూ.తాను అప్పటి వరకు కమర్షియల్ చిత్రాలలో నటించాను కానీ జెర్సీ లాంటి సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో అనే సందేహం కలిగింది.

ఈ సినిమాకి తను సూట్ అవుతానో లేదో అని సందేహం వచ్చింది.అందుకే ఈ సినిమాని రిజెక్ట్ చేశానని రష్మిక వెల్లడించారు.

Telugu Bollywood, Jersey, Mrinal Thakur, Shahid Kapoor, Tollywood-Movie

ఈమె ఈ సినిమా రిజెక్ట్ చేయడంతో తన కెరియర్లో ఫ్లాప్ సినిమా రాలేదు.లేదంటే జెర్సీ సినిమా ద్వారా రష్మిక తన కెరీర్లో ఫ్లాప్ సినిమాను వేసుకునేది.అయితే ఇదే సినిమాని తెలుగులో నాని శ్రద్ధ శ్రీనాథ్ నటించారు.తెలుగులో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా హిందీలో ఫ్లాప్ అయ్యింది.ఇక ఈ సినిమా హిందీలో ఫ్లాప్ అవడంతో రష్మిక ఎంతో తెలివైనదని ముందుగానే ఈ సినిమా ఫలితాలను అంచనా వేసి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అంటూ నెటిజన్లు తన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube