రష్మిక మందన( Rashmika Mandanna ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వరుస బ్లాక్ బస్టర్ సినిమాల్లో బిజీగా ఉంది.
పాన్ ఇండియా సినిమా పుష్ప సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.చలో సినిమా( Chalo Movie )తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రష్మిక తక్కువ సమయంలోనే స్టార్ అయిపోయింది.
ఇక రష్మిక- విజయ్ దేవరకొండ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనే లేదు.ఇప్పటికే వీరి మీద చాలా రూమర్స్ ఉన్నాయి.
వీరిద్దరు కలిసి మొదట గీతాగోవిందం సినిమాలో నటించారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
సీతారామం సినిమాలో కూడా రష్మిక కీలక పాత్ర పోషించింది.అయితే ఇప్పుడు ఆ పాత్ర వల్లే కొన్ని చిక్కుల్లో పడింది రష్మిక.

సీతారామం సినిమా( Sitharamam ) తాజాగా విడుదలై సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.సీతారామం సినిమా తరువాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో మాత్రం ఆలోచిస్తూ అడుగులు వేస్తుంది.
మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.ఇప్పుడు తెలుగులో నానితో ఒక సినిమాలో నటిస్తుంది.
దీంతో మృణాల్ ఠాకూర్ ఇప్పుడు బిజీ హీరోయిన్ అయిపోయింది.

అయితే ఇప్పుడు మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) వల్ల రష్మికకు కొత్త చిక్కు వచ్చి పడింది.ఇండస్ట్రీలో ఎవరు సక్సెస్ లో ఉంటె వారికే ఎక్కువ ఛాన్స్ లు వస్తాయని అందరికి తెలుసు.మొదటి సినిమాతో భారీ హిట్ కొట్టిన శ్రీలీల( Sreeleela ) వరుసగా 9 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇలానే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా వరుస సినిమాలు చేసే అవకాశం ఉంది.దీంతో రష్మికకు రావాల్సిన ఒక ఛాన్స్ మృణాల్ ఠాకూర్ కి వచ్చింది.మృణాల్ ఠాకూర్ తరువాత సినిమా విజయ్ దేవరకొండ( Vijay Deverakonda )తో నటించనుంది.ఈ సినిమాకి పరుశరాం దర్శకత్వం వహించనున్నారు.
అయితే ఈ సినిమాకు ముందు రష్మికనే అనుకున్నారని టాక్ ఉంది.అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ని తీసుకున్నారు.
దీంతో మృణాల్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేసిన రష్మిక మృణాల్ వల్లే విజయ్ తో సినిమా మిస్ అయ్యిందనే వార్త చక్కర్లు కొడుతోంది.