చలో మరియు గీతా గోవిందం సినిమా లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రష్మిక మందన ప్రస్తుతం నేషనల్ క్రష్ అంటూ గుర్తింపు దక్కించుకొని బాలీవుడ్ సినిమా ల్లో కూడా వరుసగా నటిస్తోంది.తాజాగా రష్మిక మందన హిందీ లో నటించిన మొదటి చిత్రం గుడ్ బాయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్ కీలక పాత్ర లో నటించిన గుడ్ బై సినిమా కి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.రష్మిక మందన మరియు అమితా బచ్చన్ పాత్ర లకు పాజిటివ్ స్పందన వచ్చినప్పటికీ ఓవరాల్ గా సినిమా బాలేదంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ఈ సమయం లోనే రష్మిక మందన రియాక్షన్ ఏంటో అంటూ చాలా మంది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.హాలిడేస్ కోసం విజయ్ దేవరకొండ తో కలిసి మాల్దీవ్స్ కి వెళ్ళిన విషయం తెలిసిందే.
అక్కడ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

రష్మిక మందన ఈ సినిమా యొక్క ఫలితం గురించి పెద్దగా పట్టించుకున్నట్లుగా అనిపించడం లేదు.పుష్ప సినిమా తో హిందీలో మంచి పేరును దక్కించుకున్న రష్మిక మందన ఈ సినిమా తో ఆ పేరు ని పోగొట్టుకుంది అంటూ కొందరు సౌత్ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్ సినిమా ల్లో ఇప్పటికైనా ఈమె నటించకుండా ఉంటే బాగుంటుందని, ఈమె కేవలం సౌత్ సినిమాలకే పరిమితం అయితే తన స్టార్ డమ్ కొనసాగించుకునే అవకాశం ఉంటుందని చాలా మంది చాలా రకాలుగా ఆమెకు సూచిస్తున్నారు.
కానీ రష్మిక మందన మాత్రం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది.ప్రస్తుతం ఈమె రెండు మూడు హిందీ సినిమా ల్లో నటిస్తోంది.
అందులో షాహిద్ కపూర్ సినిమా కూడా ఒకటి ఉండడం విశేషం.







