మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించాడు.
నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు.సినిమా కు సంబంధించిన టాక్ పాజిటివ్ గా వచ్చింది.
వసూలు భారీ ఎత్తున నమోదు అవుతున్న నేపథ్యం లో మెగా ఫాన్స్ చాలా ఆనందం తో ఉన్నారు.ఇప్పటికే మొదటి రోజు కలెక్షన్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయంటూ ప్రచారం చేయగా మరో వైపు సోషల్ మీడియాలో కొందరు అఖండ సినిమా కలెక్షన్స్ ని గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ క్రాస్ చేయలేక పోయింది అంటూ ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయంలో నిజం ఎంత అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
కేవలం మొదటి రోజు మాత్రమే కాకుండా మొదటి మూడు రోజుల కలెక్షన్స్ కూడా గాడ్ ఫాదర్ మరియు అఖండ ల మధ్య పోలుస్తూ ప్రచారం జరుగుతుంది.
మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో మెగా నందమూరి ఫ్యాన్స్ వారు జరుగుతుంది.ఓవరాల్ గా చూస్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క కలెక్షన్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి.

అయితే ఏపీ మరియు తెలంగాణ లో ఏరియా ల వారీ గా చూసుకుంటే కొన్నిచోట్ల అఖండ సినిమా వసూలు గాడ్ ఫాదర్ సినిమా తో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి అనేది బాక్స్ ఆఫీస్ వర్గాల వారి మాట.అందుకే సోషల్ మీడియాలో మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ అన్నట్లుగా ఫైట్ జరుగుతోంది.ఏ హీరో సినిమా విడుదలైనప్పుడైనా ఇలాంటి కలెక్షన్స్ ఫైట్ మామూలే అయింది.కనుక ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.







