ఛలో, భీష్మ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆమె ఎవరో అందరికి తెలుసు.
నేషనల్ క్రష్ గా ప్రేక్షకుల చేత పిలిపించుకుంటూ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) పాన్ ఇండియన్ వ్యాప్తంగా అన్ని భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకు పోతుంది.హిందీ, తెలుగు, తమిళ్ వంటి భాషల్లో వచ్చిన అవకాశాన్ని వద్దు అనకుండా చేసుకుంటూ పోతుంది.

ఇటీవలే తమిళ్ లో విజయ్ సరసన వారిసు సినిమా( Varisu Movie )లో నటించి మంచి విజయం అందుకుంది.ఇక ప్రస్తుతం పుష్ప సీక్వెల్ లో నటిస్తూనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.ఇలా అమ్మడు బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.తన సినిమాల విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంది ఫాలోవర్స్ తో ఎప్పుడు టచ్ లో ఉంటుంది.
దీంతో ఈమెకు రోజురోజుకూ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది.

ఇక ఇప్పుడు ఏకంగా రష్మిక సోషల్ మీడియా( Social Media )లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.తాజాగా రష్మిక ఇన్స్టాగ్రామ్ లో 38 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకుని రికార్డ్ నమోదు చేసింది.దీంతో ఈమె ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ( Instagram ) ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్ లలో ఒకరిగా రష్మిక స్థానం సంపాదించు కుంది.
దీంతో ఈమె ఫ్యాన్స్ రష్మికకు శుభాకాంక్షలు చెబుతూ సందడి చేస్తున్నారు.
ఇది పక్కన పెట్టి ఈమె సినిమాల విషయానికి వస్తే.తమిళ్-తెలుగు ఫాంటసీ డ్రామా రెయిన్ బో( Rainbow ) సినిమాలో ఈమె నటిస్తుంది.ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది.
దీంతో పాటు ఛలో, భీష్మ వంటి హిట్స్ ఇచ్చిన వెంకీ కుడుముల( Venky Kudumula ) దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పింది.నితిన్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.







