దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో పూజా హెగ్డేతో పాటు రష్మిక కూడా ముందంజలో ఉంది.ఇలా వీరిద్దరూ పోటీగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతున్న నటి రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం తెలుగు హిందీ సినిమాల పై ఫోకస్ పెట్టిన రష్మిక ఇకపై కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే సరికొత్త కండిషన్ పెడుతోంది.
సౌత్ సినిమాలో నటించాలంటే కేవలం స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.లేదంటే బాలీవుడ్ సినిమాల వైపు అడుగులు వేస్తోంది.ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో ఈమె ఎక్కువగా బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు.

దక్షిణాది సినిమాల్లో నటించాలంటే ఎన్నో రకాల కండిషన్లు పెడుతున్నారు.తాను సౌత్ సినిమాల్లో నటించాలంటే కేవలం స్టార్ హీరోల సినిమాల అయ్యుండాలి, అలాగే ఒక్కో సినిమాకి మినిమం 2.5 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే తాను సినిమాల్లో నటిస్తానని నిర్మాతలకు కరాఖండిగా చెప్పేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే సౌత్ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 తో పాటు విజయ్ సరసన మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.







