గాయాల పాలైన నటి రష్మిక మందన్న... అసలేం జరిగిందంటే?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి రష్మిక ( Rashmika ) ఒకరు.

ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు.

అదే విధంగా బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇక సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎక్కువ కాలం పాటు కొనసాగాలి అంటే నటన నైపుణ్యంతో పాటు అందం కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొని ఉంటుంది.

ఈ క్రమంలోనే హీరోయిన్స్ ఎక్కువగా ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతూ వీలైనంతవరకు జిమ్ లోనే సమయం గడుపుతూ ఉంటారు.ఇక రష్మిక మందన్న కూడా పెద్ద ఎత్తున వర్క్ అవుట్ చేస్తూ ఫిట్ గా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది.

ఇలా జిమ్ లో పెద్ద ఎత్తున వర్కట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు తన వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.అయితే తాజాగా ఈమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉన్న నేపథ్యంలో గాయపడ్డారని తెలుస్తోంది.రోజు మాదిరిగానే ఈమె జిమ్ ( Gym ) వర్కౌట్స్ ( Work Outs ) చేస్తూ ఉండగా ప్రమాదానికి గురైయ్యారని తెలుస్తుంది.

Advertisement

ఈ ప్రమాదంలో భాగంగా కాలికి దెబ్బ తగిలినట్టు సమాచారం.

ఇలా ఈమె కాలికి దెబ్బ తగలడంతో వెంటనే హాస్పిటల్ కి వెళ్ళారని భయపడాల్సిన పనిలేదు ఒక వారం రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే రష్మిక త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈమె ఇటీవల పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఒక ప్రస్తుతం కుబేర, రెయిన్ బో ,ది గర్ల్ ఫ్రెండ్, సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రం సికిందర్ సినిమాలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

గౌతమ్ కృష్ణ అకిరా లకు ఆ స్టార్ డైరెక్టర్ అంటే ఇష్టమా..?
Advertisement

తాజా వార్తలు