టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక ( Rashmika ) ఒకవైపు పుష్ప2 సినిమాలో( Pushpa 2 ) నటిస్తూనే మరోవైపు నితిన్ వెంకీ కుడుముల కాంబో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.తాజాగా ఒక సందర్భంలో రష్మిక మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.
చిన్నచిన్న విషయాలు సైతం నాకు ఎంతో ముఖ్యమని రష్మిక తెలిపారు.లేచిన వెంటనే నేను కుక్కపిల్లలతో ఆడుకుంటానని ఆమె అన్నారు.
అలా చేయడం ఎంతో సంతోషంగా అనిపిస్తుందని రష్మిక పేర్కొన్నారు.
మాటలు ఎంతో శక్తివంతమైనవని ఆ మాటలతో మనిషిని నిలబెట్టవచ్చని మనిషి మనసును ముక్కలు చేయవచ్చని రష్మిక చెప్పుకొచ్చారు.
నేను డైరీలో ప్రతి చిన్న విషయాలను సైతం రాసుకుంటానని ఆమె అన్నారు.ఇంటికి వెళ్లిన వెంటనే అందరి పాదాలను నమస్కరించాలని డైరీలో రాసుకుంటానని నా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు పనివాళ్ల పాదాలను సైతం నమస్కరిస్తానని ఆమె కామెంట్లు చేశారు.

పనివాళ్లను నేను వేరుగా చూడనని రష్మిక చెప్పుకొచ్చారు.నాకు అందరినీ గౌరవించడం మాత్రమే తెలుసని రష్మిక వెల్లడించారు.రష్మిక పారితోషికం( Rashmika Remuneration ) 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.నా పేరెంట్స్ నన్ను చూసి గర్వపడరని రష్మిక అన్నారు.
వాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమని నేనేం చేస్తున్నానో కూడా వాళ్లకు తెలియదని రష్మిక కామెంట్లు చేయడం గమనార్హం.

నాకు ఏదైనా అవార్డ్ వస్తే మాత్రం పేరెంట్స్ ఉప్పొంగిపోతారని రష్మిక వెల్లడించారు.పేరెంట్స్ నన్ను చూసి గర్వపడాలంటే నేను సాధించాల్సింది చాలా ఉందని రష్మిక అన్నారు.నన్ను పేరెంట్స్ బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు.
నన్ను ఏ లోటు లేకుండా పెంచారని నేనెప్పుడూ రష్మిక తెలిపారు.రష్మిక వెల్లడించిన విషయాలు ఫ్యాన్స్ ను సైతం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
రష్మికకు ఇతర భాషల్లో కూడా ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.







