టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక( Heroine Rashmika Mandanna ) చాలా తెలివైన హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.కథల ఎంపిక విషయంలో ఈ బ్యూటీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే ఈ స్టార్ హీరోయిన్ తన మేనేజర్ చేతిలో మోసపోయారని సమాచారం.80 లక్షల రూపాయల మేర ఆమె మోసపోయినట్టు సమాచారం అందుతోంది.సాధారణంగా హీరోయిన్ల వ్యవహారాలు మేనేజర్లు చూసుకుంటారనే సంగతి తెలిసిందే.

అయితే ఏ విధంగా మోసం చేశాడనే సంగతి తెలిసిందే.హీరోయిన్లు వరుసగా షూటింగ్ లతో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్లు మేనేజర్లపై డిపెండ్ కావడం జరుగుతుంది.గతంలో కూడా ఇలా మేనేజర్ల వల్ల మోసపోయిన సెలబ్రిటీల జాబితా ఎక్కువగానే ఉంది.
హిట్ల మీద హిట్లు సాధిస్తున్న రష్మిక ఈ విధంగా మేనేజర్ చేతిలో మోసపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.ఇప్పటికే ఆమె మేనేజర్ ను తీసేశారని బోగట్టా.
అయితే మోసపోయిన మొత్తాన్ని రష్మిక రికవరీ చేసుకుంటారా? లేదా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది.ఇకపై రష్మిక మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం రెయిన్ బో అనే ప్రాజెక్ట్ తో పాటు పుష్ప2 సినిమా( Pushpa 2 )లో రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం.

రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమా( Rashmika Upcoming Movies )లతో బిజీ అవుతుండగా ఒక్కో సినిమాకు ఈ బ్యూటీ పారితోషికం 5 నుంచి 7 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.యానిమల్ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ కాగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం రష్మిక క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.రష్మిక భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం భారీ సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







