ఆ విషయంలో దిగొచ్చిన రష్మిక... సంతోషంలో అభిమానులు

కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న( Rashmika Mandanna ).తెలుగులో నాగశౌర్యతో కలిసి నటించిన ఛలో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Rashmika Came Down In That Matter Fans Are Happy ,paramvaa Studioes,kirik Party,-TeluguStop.com

ఇలా తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక తరచూ పలు వివాదాలలో కూడా చిక్కుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె పలు విషయాలను తెలియజేశారు.

Telugu Kirik, Kollywood, Rakshit Shetty, Rashmika-Movie

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తాను నటిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు.చిన్నప్పటి నుంచి తనకు సినిమాలు అంటే చాలా ఇష్టం.అందుకే ఎలాగైనా నటి కావాలన్న ఉద్దేశంతో ఆడిషన్స్ కు వెళ్లి నిరాశతో తిరిగి వచ్చేదాన్ని ఇలా ఎక్కడ తనకు అవకాశాలు రాకపోవడంతో నాకు నటించే రాత రాయలేదేమోనని భావించాను.

అలాంటి సమయంలోనే ఒక అందాల పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది.ఈ పోటీలలో తాను గెలవడంతో తన ఫోటో పేపర్లో పెద్దగా పడింది.అయితే ఇది చూసినటువంటి పరంవా స్టూడియోస్( Paramvaa Studioes ) తమ బ్యానర్లో తనకు కిరిక్ పార్టీ( Kirik Party ) సినిమా అవకాశాన్ని కల్పించారని తెలిపారు.

Telugu Kirik, Kollywood, Rakshit Shetty, Rashmika-Movie

వారు వారి బ్యానర్లో నిర్మిస్తున్నటువంటి కిరిక్ పార్టీ సినిమాలో అవకాశం కల్పించారని ఈ సందర్భంగా తెలియజేశారు.అయితే రష్మిక చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే గతంలో ఈమె తనకు అవకాశం కల్పించినటువంటి ఈ నిర్మాణ సంస్థ పేరు పలకడానికి కూడా ఇష్టపడకపోగా సో కాల్డ్ అంటూ మాట్లాడటంతో పెద్ద ఎత్తున ఈ విషయం ద్వారా రష్మిక వివాదంలో చిక్కుకుంది.

అయితే ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ గురించి ఈమె మాట్లాడటంతో ఈ విషయంలో రష్మిక ఒక మెట్టు దిగి వచ్చిందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ నిర్మాణ సంస్థ అధినేత నటుడు రక్షిత్ శెట్టిని ఈమె ప్రేమించిన విషయం మనకు తెలిసిందే.

పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు.కొన్ని కారణాల వల్ల ఈ నిశ్చితార్థం రద్దయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube