రష్మికకు ఆమె చెల్లికి ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్ అవ్వాలిసిందే.. బాబోయ్ మరీ ఇంతనా?

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపుసంపాదించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులోకి ఛలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం వరుస సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే అగ్రతారక గుర్తింపు సంపాదించుకున్నారు.

 Rashmika And Her Sister Shiman Mandanna Age Gap Details, Rashmika ,shimna Manda-TeluguStop.com

ఇకపోతే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

 Rashmika And Her Sister Shiman Mandanna Age Gap Details, Rashmika ,Shimna Manda-TeluguStop.com

ప్రస్తుతం మూడు నాలుగు బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా కెరియర్ పరంగా అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకొని ఎంతో బిజీగా ఉన్న రష్మిక తరచు తన ఫ్యామిలీ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.

ఈ బ్యూటీకి ఒక బుల్లి చెల్లి ఉందనే విషయాన్ని ఎన్నో మార్లు రష్మిక సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇకపోతే తాజాగా ఏమి సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మిక కు కేవలం 9 సంవత్సరాల వయసు గల చిట్టి చెల్లి ఉంది.

ఇక రష్మికకు తన చెల్లికి మధ్య వయసు తేడా తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే.రష్మిక 1996 ఏప్రిల్ 5వ తేదీ జన్మించారు.

ప్రస్తుతం ఈమె వయసు 26 సంవత్సరాలు.

ఇకపోతే రష్మిక సోదరి పేరు శిమ్న మందన్న ఈమె వయసు 9 సంవత్సరాలు ఈమె 2013 మార్చి రెండవ తేదీ జన్మించారు.అయితే రష్మికకు తన సోదరికి మద్య 17 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉండడంతో ఎంతోమంది ఇది తెలిసి ఆశ్చర్యపోతున్నారు.ఇలా హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మికకు ఇంత చిన్న చెల్లెలు ఉన్నారని తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం వీరి ఫ్యామిలీ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే హిందీలో నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7వ తేదీ విడుదల కానుంది.

ఇది ఈమె నటించిన డేబ్యూ సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా ఏడవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఈమె సూపర్ స్టార్ అమితాబ్ కుమార్తెగా సందడి చేయనున్నారు.ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా కానున్నారు.

అలాగే దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న వారసుడు సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నారు.ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

Video : Rashmika And Her Sister Shiman Mandanna Age Gap Details, Rashmika ,Shimna Mandanna,kollywood, Rashmika Mandanna Sister, Shiman Mandanna, Good Bye Movie, Rashmika Movies, Rashmika Mandanna Family #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube